ఏపీ అధికార పార్టీ వైసిపి 2024 ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకు ఏపీలోని విపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే టిడిపి ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పాటు అవుతోంది.
ఈ మహాకూటమిలో ప్రస్తుతానికి బిజెపి, జనసేన అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.అయితే బిజెపి జనసేన పార్టీలను కూడా ఈ కూటమిలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
నిన్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఈ కూటమిని తెలుగుదేశం ఏర్పాటు చేసింది.
దీనికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అధ్యక్షత వహించారు.ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం – ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు, రామకృష్ణ జనసేన తరఫున కందుల దుర్గేష్ , కాంగ్రెస్ తరపున నరసింహారావు ,జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైసీపీని ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహం తో ముందుకు వెళ్లాలని అఖిల పక్ష నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.వైసీపీని అధికరానికి దూరం చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతారిపైకి రావాలనీ, ఉమ్మడి వ్యూహాలతో వైసిపి 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రస్తుతం ఏపీ పర్యటనకు వచ్చిన ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా ఏపీలోని వైసీపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చి ఉమ్మడి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లి వైసిపి ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగే చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా ఈ మహా కూటమిలోకి రావలసిందిగా జనసేనకు పిలుపునిచ్చారు .మతవాద పార్టీలతో పొత్తు పెట్టుకోవద్దని, అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని బిజెపిని ఉద్దేశించి శ్రవణ్ కుమార్ విమర్శించారు.