క్రమశిక్షణ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )కంటే, వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan) ఎంత నిక్కర్చిగా ఉంటారో ఇటీవల వైసిపి( YCP )లో చోటు చేసుకున్న సస్పెన్షన్ల వ్యవహారం చూసుకుంటేనే అర్థం అవుతుంది.చంద్రబాబు తరహాలో బుజ్జగింపులకు వెళ్లడం జగన్ కు ఇష్టం ఉండదు.
ఏదైనా మొహమాటం లేకుండానే చెప్పేస్తూ ఉంటారు.రాబోయే ఎన్నికల్లో కొంతమందికి టికెట్లు ఇచ్చేదే లేదు అని నేరుగా వారికే చెప్పి, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేసారు.
ఈ తరహా విధానం వల్ల తాత్కాలికంగా నష్టం చేకూరినా, ఎన్నికల సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవనే లెక్కల్లో జగన్ ఉన్నారు.

అంతేకాదు పార్టీలో గ్రూపు రాజకీయాలను, అసంతృప్తులకు చెక్ పెట్టేందుకు ఈ తరహా ఫార్ములానే సరైనదనే ఆలోచనతో జగన్ ఉన్నారు.ఎప్పుడూ జగన్ తీరును తప్పుపట్టే టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు క్రమశిక్షణ విషయంలో జగన్ విధానాన్ని పాటించేందుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు.ఉత్తరాంధ్ర టిడిపి( TDP) సభలో చంద్రబాబు వ్యవహరించిన తీరు దీనికి నిదర్శనంగా కనబడుతోంది.
పార్టీ సీనియర్ నాయకులకు, అసంతృప్తులకు, పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారికి చంద్రబాబు తీవ్రంగానే హెచ్చరికలు చేశారు.ఇంట్లో కూర్చుని ఎవరు ఆందోళన చేస్తున్నారో తనకు తెలిసినని, ముందే మాట్లాడుకుని పోలీసులను పిలిపించుకొని హౌస్ అరెస్ట్ అయిన వారు తెలుసునని, తన దగ్గర అటువంటి వారి ఆటలు సాగమని బాబు హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి మాత్రమే తాను టిక్కెట్లు ఇస్తానని బాబు చెప్పారు.అంతేకాదు రాబోయే ఎన్నికల్లో 40% టిక్కెట్లు యువతకే ఇస్తున్నట్లు ప్రకటించారు.

బాబు ప్రకటనతో టిడిపి సీనియర్లలో ఆందోళన మొదలైంది.రాబోయే ఎన్నికల్లో సీనియర్లను తప్పించి వారికి పార్టీ పదవులు కట్టుబడతారని ప్రచారం జరుగుతుంది.ఇప్పుడు ఆ విషయంలో బాబు క్లారిటీ ఇవ్వడంతో, రాబోయే ఎన్నికల్లో తమకు టిక్కెట్ వస్తుందా రాదా అనే టెన్షన్ లో సీనియర్లు ఉన్నారు.ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య ఉన్న వైరాన్ని చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు.
ఇటీవల గంటాకు చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండడంతో, అయ్యన్నపాత్రుడు సైలెంట్ అయ్యారు .విశాఖలో నిర్వహించిన సదస్సుకు ఆయన ఆలస్యంగా హాజరయ్యారు.అయితే ఇది గుర్తించిన చంద్రబాబు సీనియర్లు అలకలు మాని , పార్టీ విజయానికి కృషి చేయాలని, లేకపోతే వారి స్థానంలో యువ నాయకులకు టిక్కెట్ ఇచ్చేందుకు తాను వెనకాడబోనని , పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలి తప్ప , అలకలు ఆందోళనలతో పార్టీకి నష్టం చేకూర్చితే ఉపేక్షించబోననే సంకేతాలను బాబు ఇచ్చారు.