ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలిగా చిన్నమ్మ ఉరఫ్ పురందేశ్వరి( Purandeswari ) నియామకం జరిగినప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు.ముఖ్యంగా అప్పటివరకు కాపు సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇస్తున్నట్లుగా కనిపించిన బిజెపి ఒక్కసారిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరి ని అధ్యక్షురాలిగా నియమించడంతో భాజపా విధానపరమైన స్టాండ్ మార్చుకుందా? అన్న విశ్లేషణలు వినిపించాయి.అయితే కాపు సామాజిక వర్గం పూర్తిగా జనసేన వైపు షిఫ్ట్ అవ్వుతున్న వాతావరణం కనిపించడం తో జనసేన ను మిత్రపక్షంగా ఉంచుకొని, కమ్మ సామాజిక వర్గాన్ని కూడా కొంతవరకు చీల్చితే అది విన్నింగ్ కాంబినేషన్ అవుతుందన్న ముందు చూపుతోనే భాజపా ఈ స్టెప్ తీసుకుందని విశ్లేషణలు వినిపించాయి.
అయితే పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తర్వాత ఇప్పటివరకు చెప్పుకోదగ్గ చేరికలు ఆంధ్ర బాజాపలో లేవని ,ఈ విషయంలో అధిష్టానంకూడా అసంతృప్తి గా ఉందంటూ ఒక వర్గం విశ్లేషిస్తుంది.మరోపక్క వైసీపీ( YCP ) పై దూకుడుగా వెళ్ళటం కూడా కేంద్ర పెద్దలకు నచ్చటం లేదని ఈ విషయంపై ఇప్పటికే వైసీపీలోని ఉన్నత స్థాయి నేతలు కేంద్ర బాజాపాకు ఫిర్యాదులు చేశారని కూడా వార్తలు వస్తున్నాయి .
ప్రత్యక్షంగా వైసిపితో ఏ విధమైన స్నేహం భాజపాకు లేకపోయినప్పటికీ, కేంద్రంలో రాజ్యసభలో ఉన్న వివిధ అవసరాల రీత్యా వైసీపీతో బిజెపి తెరవెనుక స్నేహం నడిపిస్తుందని, అందుకే ఆర్థికపరమైన అవరాధాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాల ఆదుకునే విధంగా కేంద్రం జగన్ కి మద్దత్తు ఇస్తుందని , చంద్రబాబు అరెస్ట్ వంటి కీలక నిర్ణయాలలో కూడా కేంద్రం గప్ చుప్ గా ఉండడానికి ఇదే కారణం అంటూ విశ్లేషణలు ఉన్నాయి.ఇలాంటి సమయంలో పురందేశ్వరి వైసిపి వ్యతిరేక స్టాండ్ తీసుకొని జగన్ పై మరియు విజయసాయిరెడ్డి( Vijaysai Reddy ) పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం వరకూ వెళ్లడం పట్ల కేంద్ర భాజపా పెద్దలు కూడా గుర్రుగానే ఉన్నారని, త్వరలోనే పురందేశ్వరి పదవి మార్పు జరుగుతుందంటూ విశ్లేషణలు వస్తున్నాయి.అయితే కేంద్ర మంత్రి హోదాలో కూడా పనిచేసీన పురందేశ్వరికి పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నడపడం తెలుసని, ఆమె పూర్తిస్థాయి పార్టీ పరమైన విధానంలోనే ముందుకు వెళ్తున్నారని, అందువల్ల అధ్యక్ష మార్పు వంటివి ఊహగానాల మాత్రమే అంటూ మరొక వర్గం చెప్పుకొస్తుంది.