పవన్ కు ముద్రగడ అలా చెప్పాడా ? ఆ సైలెన్స్ అందుకేనా ?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు.వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఏ పార్టీలో చేరకుండా మౌనంగా ఉండిపోయారు.

ఒక పక్క ఎన్నికల ప్రచార హోరు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో కాపు రిజర్వేషన్ అంశాన్ని తెర మీదకు తెచ్చి రాజకీయ పార్టీలకు డిమాండ్లు వినిపించాల్సిన ఆయన ఆ పని కూడా చేయడంలేదు.ఇక ఆయన జనసేన లో చేరుతారని, ఎంపీగా పోటీ చేస్తారని బలమైన వార్తలు వినిపించినా అదేదీ జరగలేదు.

పవన్ కూడా ఆయన విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోలేదు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కి పవన్ ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

తాను నేరుగా మీదగ్గరకు వస్తానని, మీతో మాట్లాడుతా అని పవన్ చెప్పగా, దానికి ముద్రగడ నో చెప్పినట్టు తెలుస్తోంది.తాను ఈ సమయంలో మిమ్మల్ని కలవడానికి ఇష్టపడడంలేదని ముద్రగడ పవన్ కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.కావాలంటే ఎన్నికలు ముగిసిన తరువాత కలుద్దాం అంటూ పవన్ కి నచ్చచెప్పినట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ ఎన్నికల్లో తాను కానీ, తన కొడుకు కానీ అస్సలు కలుగచేసుకోవడం లేదని, పోటీచేయడం లేదని, అందువల్ల ఇప్పుడు కలవడం వలన కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని పవన్ కి ముద్రగడ చెప్పారట.ఆయన మాటలకి పవన్ ఏమి చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయినట్టు సమాచారం.

టికెట్ల టాయింపు సమయంలో పిఠాఫురం సీటును ముద్రగడకు ఇస్తామని టీడీపీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.కానీ దానికి కూడా ముద్రగడ తిరస్కరించినట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారం చూస్తుంటే జనసేన, టీడీపీ మీద ముద్రగడకు ఇంకా కోపం చల్లారినట్టు కనిపించడంలేదు.

చాపకింద నీరులా తన అనుచరులతో వైసీపీకి ప్రచారం చేయిస్తున్నట్టు కూడా ఈ రెండు పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు