రామ్ చరణ్‌కు ‘ధృవ’ వంటి మంచి విజయాన్ని అందించాడనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం బాధ్యతలను సురేందర్ రెడ్డికి అప్పగించిన విషయం తెల్సిందే.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సైరా చిత్రం రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఊరిస్తూనే ఉంది.
దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో చిత్రం రూపొందించాలని భావించారు.అయితే షూటింగ్ ఆలస్యం మరియు దర్శకుడి ప్లానింగ్ తేడా కొట్టడంతో సినిమా బడ్జెట్ దాదాపుగా 100 కోట్లు పెరిగినట్లుగా సమాచారం అందుతోంది.
భారీ బడ్జెట్ చిత్రాల మేకింగ్‌లో సురేందర్ రెడ్డికి అనుభవం లేకపోవడంతో ఖర్చు డబుల్ డబుల్ అవుతుందని నిర్మాత రామ్ చరణ్ సీరియస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.అదే సమయంలో తన తండ్రి చిరంజీవిని కూడా సురేందర్ రెడ్డి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే భావనలో రామ్ చరణ్ ఉన్నాడట.
దాంతో సురేందర్ రెడ్డిపై కస్సు బుస్సుమంటున్నాడని తెలుస్తోంది.షూటింగ్ వేసవి వచ్చినా కూడా ఇంకా చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి గారి ఆరోగ్యం దెబ్బ తింటుందేమో అనే భయంతో చరణ్ ఉన్నాడు.

సురేందర్ రెడ్డి ఎంత బడ్జెట్ పెట్టినా సరే కాని, ఆ డబ్బులకు తగ్గట్లుగా సినిమాను రిచ్‌గా, భారీగా రూపొందిస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే సురేందర్ రెడ్డిపై చరణ్ కోపంగా ఉన్నాడనే వార్తలు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్నాయి.భారీ ఎత్తున సినిమా నిర్మిస్తున్న చరణ్ డైరెక్టర్‌పై సీరియస్‌గా ఉన్నాడు అంటే ఆ సినిమా ఔట్ పుట్‌పై నిర్మాత సంతృప్తిగా లేడని అర్థం.అదే కనుక నిజం అయితే సైరా చిత్రం మొత్తం కూడా ఆగం అవ్వడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది.







