జనసైనికులను పవన్ మోసం చేస్తున్నారు..: సీపీఎం నేత శ్రీనివాసరావు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీపీఎం నేత శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.జనసైనికులను పవన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.

పవన్ కల్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటున్నారన్న సీపీఎం నేత శ్రీనివాసరావు జనసేనానికి బుల్డోజర్ పాలన కావాలా అని ప్రశ్నించారు.ప్రశ్నిస్తాననే పవన్ బీజేపీని ఏనాడైనా ప్రశ్నించారా అని నిలదీశారు.

బీజేపీ ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలు అని విమర్శించి ఇప్పుడు బీజేపీకి పవన్ వంతపాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు