"గీతా కార్మికుల భీమా" ప్రవేశపెట్టినందుకు గీత కార్మికుల ఆధ్వర్యంలో కెసిఆర్, కేటీఆర్ లకు పాలాభిషేకం

రైతు బీమా తరహాలో సాధారణంగా మరణించిన వ్యక్తికి కూడా ఇట్టి బీమా వర్తించాలిగీత కార్మికుడు అకస్మాత్తుగా చెట్టుపై నుంచి కిందపడి అవయవాలు కోల్పోతే బాధితునికి ఇట్టి బీమాలో కొద్ది మొత్తం అమలు చేయాలిబాధితుడికి ఎక్స్గ్రేషియా, పెన్షన్ విధానం కూడా అమలు చేయాలిరాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ గీత కార్మికులకు "గీతా కార్మికుల భీమా" పథకం ప్రవేశపెట్టినందుకు గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు "చిదుగు గోవర్ధన్ గౌడ్",గౌడ కుటుంబ సభ్యులు సుమారు 200 మంది కలిసి నేడు కేసీఆర్,కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

అనంతరం చిదుగు గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ.

గౌడ బంధువుల కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కెసిఆర్, కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.గతంలో చిదుగు గోవర్ధన్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ దృష్టికి గౌడ కులస్తులను ఆదుకోవాలని భీమా లాంటి పథకం అమలు చేయాలని తెలిపానన్నారు, రాబోయే రోజుల్లో గౌడ కులస్తులందరూ బిఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉంటామని గీత కార్మికుడు మరణిస్తే ఎక్స్గ్రేషియా వచ్చేదని అది కొన్ని కారణాలవల్ల ఆలస్యమవుతుందని కెసిఆర్ తీసుకున్న నిర్ణయం"గీత కార్మికుల భీమా"చాలా హర్షింపదగిన విషయమని తెలిపారు.

ఇట్టి బీమా వల్ల గౌడ కుటుంబ సభ్యులకు "బీమా - ధీమా"గా ఉందని తెలిపారు.అలాగే కంచర్ల అమరేందర్ గౌడ్, వికృర్తి లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ.

గీత కార్మికుడు చెట్టుపై నుంచి కిందపడి లేదా సాధారణంగా మరణించిన "రైతు బీమా" తరహాలో ఇట్టి బీమా వర్తింప చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు.ఒకవేళ శాశ్వత అంగవైకల్యం కలిగితే అట్టి వ్యక్తులకు ఇట్టి బీమాలో కొద్ది మొత్తం వర్తింపజేయాలని, ఎక్స్గ్రేషియా,పెన్షన్ విధానం కూడా అమలు చేయాలని కెసిఆర్, కేటీఆర్ లను కోరారు.

Advertisement

ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం కు గౌడ కులస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణ గౌడ్, కోశాధికారి కొండ రమేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ బూర శ్రీనివాస్ గౌడ కులస్తులు పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News