YouTuber Chandu Sai : నా కడుపు మీద కొట్టారు.. కేసు వల్ల సినిమా పోయింది.. యూట్యూబర్ చందూసాయి కామెంట్స్ వైరల్!

ప్రముఖ యూట్యూబర్ చందు సాయి( YouTuber Chandu Sai ) గురించి మనందరికీ తెలిసిందే.

చందు సాయి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పక్కింటి కుర్రాడు( pakkinti kurradu ).

ఈ వెబ్ సిరీస్ ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకున్నాడు చందు సాయి.అయితే సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఫేమ‌స్ అవ్వ‌డం చాలా ఈజీ అయిపోయింది.

కానీ ఆ పాపులారిటీని కాపాడుకోవ‌డం మాత్రం అంత ఈజీ కాదు.పొర‌పాటున నోరు జారినా, ఏదైనా త‌ప్పు చేసినా, ఏదేని కేసులో ఇరుక్కున్నా అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకుంటారు.

న‌లుగురిలో న‌వ్వుల‌పాలు అవుతారు.చందు సాయికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది.

Pakkinti Kurradu Chandoo Sai About His Painful Days
Advertisement
Pakkinti Kurradu Chandoo Sai About His Painful Days-YouTuber Chandu Sai : న�

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత‌డిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.దాదాపు నెల రోజులు జైలు శిక్ష అనుభ‌వించిన‌ త‌ర్వాత బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చాడు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చందు సాయి ఈ కేసు గురించి మాట్లాడుతూ.

ఎవ‌రిమీదైనా పగ తీర్చుకోవ‌డానికి మ‌రీ ఇంత దూరం వెళ్ల‌కూడ‌దు.ఉన్న‌ది చెప్తే ఓకే కానీ లేనిది క‌ల్పించ‌డం అవ‌స‌ర‌మా? త‌ప్పు క‌దా నా కుటుంబ స‌భ్యుల( My family members ) మీద కేసు పెట్టారు.అదింకా పెద్ద‌ త‌ప్పు.

వాళ్లు ఎంత బాధ‌ప‌డ‌తారు? 27 రోజులు జైల్లో ఉన్నాను.మొద‌టి మూడు రోజులు విప‌రీతంగా ఏడ్చేశాను.

Pakkinti Kurradu Chandoo Sai About His Painful Days

నిజం ఎప్ప‌టికైనా తెలుస్తుంద‌ని బాధ‌ను దిగ‌మింగుకుని బ‌తుకుతున్నాను.నిజంగానే నేను అమ్మాయిని ప్రేమించాను, తన‌తో రిలేష‌న్‌లో ఉన్నాను.కానీ స‌హ‌జీవ‌నం అనేది వేస్ట్‌ అని ఆల‌స్యంగా తెలిసొచ్చింది.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

నేను నా రిలేష‌న్‌షిప్‌ను కాపాడుకోవ‌డానికి ఎంతో చేశాను, అక్క‌డ నేను ఏ త‌ప్పూ చేయ‌లేదు.అయినా చివ‌ర‌కు నాకే దిమ్మ‌తిరిగేలా చేసి కేసు పెట్టారు.

Advertisement

ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌క్కింటి కుర్రాడిగా పేరు సంపాదించుకున్నాను.నా క‌డుపు మీద కొట్టారు.

ఈ కేసు వ‌ల్ల‌ ఒక సినిమా పోయింది.నా మీద కేసు ఫైల్ అయిందే త‌ప్ప దోషిన‌ని రుజువు కాలేదు.

ద‌య‌చేసి ఎవ‌రూ న‌న్న‌లా చూడ‌కండి.అయినా అబ్బాయిల‌కు స‌మాజంలో ర‌క్ష‌ణ లేదు.

త‌ప్పు జ‌రిగితే అది ఇద్ద‌రూ చేస్తారు.కానీ శిక్ష ఒక్క‌రికే ప‌డుతుంది.

ఈ విష‌యంలో అబ్బాయిలు చాలా జాగ్ర‌త్త‌లు ఉండాలి అని చెప్పుకొచ్చాడు చందు.

తాజా వార్తలు