మరోమారు భారీగా షెళ్ళింగ్ చేసిన పాకిస్థాన్!

ఆదివారం జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ రాష్ట్రం లో పాకిస్థాన్ సైన్యం భారత భద్రతా బలగాల పై కాల్పులు జరిపాయి, దీనికి భారత ఆర్మీ ధీటుగా స్పందించింది దానితో దెబ్బకు దారికొచ్చిన పాక్ సైన్యం వెనక్కి తగ్గిందని భారత ఆర్మీ డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ చెప్పుకొచ్చారు.ఈ కాల్పులు జరుగుతున్న సమయంలో ముష్కరులు లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద చొరబడడానికి ప్రయత్నించారని దీన్ని భారత్ అడ్డుకుందని ఈ సంఘటనలో భారత్ నుండి ఎటువంటి క్యాజువాలిటీస్ లేవని ఆయన అన్నారు.

సరిగ్గా ఉదయం 3.20 నిమిషాలకు మొదట కాల్పులు అటు వైపు నుండి మొదలయ్యాయని గుర్తించిన భారత సైన్యం వెంటనే తగిన చర్యలు తీసుకుని వారిని సమర్ధవంతంగా అడ్డుకుందని ఆయన తెలిపారు.ఉదయం 5 గంటల వరకు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని, దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

పాకిస్థాన్ కు ఎన్ని సార్లు సమాధానం చెప్పినా వాళ్ళ తీరు మారదని మరోసారి నిరూపితమైంది, కాగా మోడీ ప్రభుత్వం లోని భారత దేశం సురక్షిత చేతుల్లో ఉందని , పాకిస్థాన్ ఎన్ని పన్నాగాలు పన్నినా ఏమి చేయలేరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు .

దేవర రికార్డును బ్రేక్ చేసిన పెద్ది.. రామ్ చరణ్ సంచలనాలకు తెర తీశాడుగా!

తాజా వార్తలు