మా తప్పు కాదు

చేపా చేపా ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మోపు అడ్డం వచ్చింది అనే చేపల కథలా ఉంది పాకిస్తాన్‌ వైఖరి.

భూకంప బాధిత నేపాల్‌కు తన వంతు సాయంగా ఆహారాన్ని సరఫరా చేసింది పాకిస్తాన్‌.

ఆకలితో అలమటిస్తున్న బాధితులకు ఆహారం ఇవ్వడం మంచిదే కదా.! కాని ఆ ఆహార ప్యాకెట్లు నేపాల్‌కు చేరగానే అంతా ఆశ్చర్యపోయారు.ఆ ప్యాకెట్లలో ఉన్నది గొడ్డు మాంసం మసాలా.

ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యమైన నేపాల్‌లో గొడ్డు మాంసం తినడం, గోవులను చంపడం చట్టరీత్యా నేరం.ఇందుకు కఠిన శిక్షలూ ఉన్నాయి.

దీంతో ఈ ఆహారాన్ని నేపాల్‌ ప్రభుత్వం తిప్పి పంపింది.పాక్‌పై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.

Advertisement

దీంతో కలవరపడిన పాక్‌ ప్రభుత్వం అది గవర్నమెంటు తరపున జరిగిన పొరపాటు కాదని, విమానయాన శాఖ వారి పొరపాటని బొంకింది.నేపాల్‌ ప్రజల సెంటిమెంటును, మత విశ్వాసాలను అగౌరవపరచవద్దని నేపాల్‌ అధికారులు పాక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గొడ్డు మాంసం పంపినందుకు పాక్‌ తమకు క్షమాపణ చెప్పాలని కొందరు నేపాలీయులు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ వివాదంపై పాక్‌ అధికారులు మాట్లాడుతూ ప్యాకెట్లలో ఉన్న ఆహారం ఏమిటనేది తాము ప్యాకెట్లపై ఇంగ్లీషులో, ఉర్దూలో ప్రింట్‌ చేశామని, ఆ ఆహారాన్ని తినడం, తినకపోవడం వారి ఇష్టమని అన్నారు.

భారతీయ బయటపెట్టిన గొడ్డు మాంసం విషయం పాక్‌కు ఇబ్బందికరంగా మారింది.

వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?
Advertisement

తాజా వార్తలు