మోదీకి ఇజ్రాయిల్‌ ప్రధాని ప్రశంస

ప్రధాని నరేంద్ర మోదీపై స్వదేశంలో తీవ్రంగా విమర్శలు వస్తున్నప్పటికీ విదేశీ ప్రభుత్వాధినేతలు మాత్రం యమ పొగుడుతున్నారు.ఎందుకు? ఆయన అంత గొప్ప పని ఏం చేశారు? నేపాల్‌ భూకంప బాధితులకు ఆపన్న హస్తం అందించడంలో మోదీ చాలా చురుగ్గా వ్యవహరించారని, తక్షణమే స్పందించి ఆ దేశానికి అవసరమైన సహాయం అందించారని విదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేపాల్‌కు సహాయం విషయంలో మోదీని బాగా మెచ్చుకున్నారు.ఆ వెంటనే ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ మోదీని శభాష్‌ అని ప్రశంసించారు.

 Benjamin Netanyahu Appreciates Modi-TeluguStop.com

ఈ పొగడ్తలకు మోదీ అర్హుడే.నేపాల్‌లో భూకంపం రాగానే వెంటనే సహాయ బృందాలను, అవసరమైన పరికరాలను, ఆహారాన్ని, ఇతర సామగ్రిని భారత్‌ ఆగమేఘాల మీద పంపింది.

వైమానిక దళానికి చెందిన విమానాలు నేపాల్‌కు దూసుకుపోయాయి.భారతీయులను స్వదేశానికి తీసుకురావవడంలో మోదీ సర్కారు చూపినంత చొరవ చైనా చూపించలేదని అక్కడి మీడియా విమర్శించింది.

ఇంత సైన్యం ఉండి ఏం చేస్తోందని ప్రశ్నించింది.నేపాల్‌కు సహాయం చేయాల్సిన బాధ్యత ఇతర దేశాల కంటే భారత్‌కు ఎక్కువగా ఉంది.

ఈ విషయం గుర్తించిన మోదీ వెంటనే స్పందించారు.మంచి పని చేస్తే మెచ్చుకోవాల్సిందే కదా….!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube