2024 ఎన్నికలకు సమయం చాలానే ఉన్నా, అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడో హడావుడి మొదలు పెట్టేశాయి.ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమైనట్లుగా వ్యవహారాలు చేస్తున్నాయి.
దీనిలో భాగంగానే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకు కలిసి వస్తుందనే విషయంలో ఎవరికి వారు అంచనా వేసుకునే పనిలో ఉన్నారు.ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
దీనికి తగ్గట్లుగానే జనసేన తో పొత్తు అంశాన్ని చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనే విషయం ఇప్పుడు జనసేన కు ఇబ్బందికరంగా మారింది.
పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఏపీలో తమ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే విషయం పవన్ కు బాగా తెలుసు .అయితే గతంలో టిడిపితో పొత్తు పెట్టుకున్న పార్టీలతో వ్యవహరించిన తీరు వంటి వ్యవహారాలు తలనొప్పులు తెచ్చి పెడతాయి అనే భయం వైసిపి మినహా అన్ని పార్టీల్లోనూ ఉంది.టిడిపి తో పొత్తు పెట్టుకున్న.తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో పేచీలు వస్తాయని, టిడిపితో పొత్తు లో బాగంగా తమ పార్టీకి కేటాయించిన సీట్లలో టిడిపి నామినేషన్లు వేయడం వంటి వ్యవహారాలు గతంలో చాలానే చోటుచేసుకున్నాయనే విమర్శలు టిడిపిపై ఉన్నాయి.
అందుకే ఇప్పుడు పొత్తులు అంశాన్ని చంద్రబాబు పదేపదే ప్రస్తావిస్తున్న, పెద్దగా ఎవరు స్పందించడం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం జనసేన, బిజెపి పార్టీలు ఏపీలో పొత్తు పెట్టుకున్నాయి.దీంతో పాటు టిడిపి కూడా ఈ పార్టీలకు జత కలిస్తే తప్పకుండా విజయం సాధ్యమే అయినా, టీడీపీ తో పొత్తు భస్మాసుర హస్తమే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉండడం తోనే, టీడీపీ పొత్తు కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా, జనసేన తో సహా , మిగతా పార్టీల నుంచి సరైన స్పందన కనిపించకపోవడానికి కారణమట.