తన ఒకప్పటి అనుంగ శిష్యుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలుగుదేశం అధినేత చంద్రబాబును(Chandrababu) ఏ మేరకు సంతోష్ పెట్టిందో తెలియదు కానీ ఆయన భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు మాత్రం బిజెపి(BJP) చెక్ పెట్టినట్టే కనిపిస్తుంది.ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ లాగే కేంద్రంలో మోడీ(Narendra Modi) గ్రాఫ్ కూడా తగ్గుతూ వస్తుందని, కాంగ్రెస్ మెల్లగా రాష్ట్రాలను గెలుచుకుంటూ 2024 లో కేంద్రంలో అధికారం దిశగా కదులుతుందని టిడిపి అంచనా వేస్తుందని ఒక వేళ 5 రాష్ట్రాల ఎన్నికల లో కాంగ్రెస్ గనక మంచి పలితాలు సాదిస్తే బాబు కాంగ్రెస్ వైపు టర్న్ అవుతారని, అందుకే తెలంగాణ లో తన పార్టీని కూడా పోటీకి పెట్టకుండా కాంగ్రెస్ సహకరిస్తున్నారని విశ్లేషణలు వచ్చాయి .
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో బిజెపి భారీ మెజారిటీ దూసుకువెళ్లడం ఇప్పుడు బాబు పరిస్థితి అడకత్తెర లో పోక చెక్కలా తయారైందట.అందుకే కాంగ్రెస్ విజయాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందించుకుండా చంద్రబాబు మౌనం గా ఉండిపోయినట్టుగా తెలుస్తుంది .
తెలంగాణలో పోటీకి నిలబెట్టకుండా రేవంత్ గెలిచేలా తెరవెనక వ్యూహం పన్నిన చంద్రబాబు ప్లాన్ నిజానికి భారీగానే సక్సెస్ అయింది.ఎవరి మద్దతు అవసరం లేకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, మ్యాజిక్ ఫిగర్ కు కొంత దూరంలో కాంగ్రెస్ ఆగిపోతే కెసిఆర్ తన చాణక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని వార్తలు వచ్చాయి .ఇప్పుడు ఎవరి చాణక్యంతోను పని లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్(Congress) గద్దెనెక్కడంతో ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబుకు ప్రయత్నించి ఉండేవారు .ఒకరకంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ గెలుచుకొని ఉండుంటే ఈపాటికి రేవంత్ రెడ్డిని స్వయంగా వెళ్లి చంద్రబాబు అభినందించినా ఆశ్చర్యపోనవసరం లేదు .కానీ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు మోడీ హవా తగ్గలేదని రుజువు చేస్తూ ఉండడంతో చంద్రబాబు ఆచి తూచి స్పందిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పుడు మరోసారి బిజెపి అనుకూల రాజకీయాలకు బాబు తెరతీసినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తుంది