ఇండియాలో ఒప్పో రెనో 8టీ లాంచ్ డేట్.. ఫీచర్లు ఇవే..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్లు తయారీ సంస్థ Oppo త్వరలో Oppo Reno 8T అనే కొత్త ఫోన్‌ను విడుదల చేయబోతోంది.

ఈ ఫోన్ 4G, 5G అనే రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్లు 2023, ఫిబ్రవరి 6న ఇండోనేషియాలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.కాకా ఇండియాలో రిలీజ్ ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.

ఈ ఫోన్ ఫొటోలు ఆల్రెడీ లీక్ అయ్యాయి.ఈ మొబైల్‌లో ఫ్లాష్‌, కర్వ్డ్ డిస్‌ప్లే, పెద్ద కెమెరా మాడ్యూల్‌ అందించారని సమాచారం.

ఒప్పో రెనో 8T అనేది ఒప్పో రెనో 8 5Gకి బెటర్ వెర్షన్.ఒప్పో రెనో 8T మొబైల్‌లో 108MP రిజల్యూషన్‌తో ప్రైమరీ కెమెరా, 2MP రిజల్యూషన్‌తో సెకండరీ కెమెరా ఆఫర్ చేశారు.

Advertisement

ముందు కెమెరా 16MPగా ఉంటుందని టాక్.ఈ స్క్రీన్ పైభాగంలో హోల్-పంచ్ కటౌట్‌లో ఉంటుంది.

ఒప్పో రెనో 8T 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి ఒక వీడియో ఆల్రెడీ లీక్ అయింది.దీనిలో లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్లు, రైట్ సైడ్ పవర్ బటన్ ఉన్నట్లు చూపిస్తుంది.ఇది థిన్‌ సైడ్స్, లోయర్ ఎడ్జ్‌స్‌తో కర్వ్డ్‌ డిస్‌ప్లేతో వస్తుంది.

ఈ అప్‌కమింగ్ ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉందని టెక్ వర్కాల సమాచారం.ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుంది.6జీబీ + 128జీబీ లేదా 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ తో ఇది రావచ్చు.దీనికి హెడ్‌ఫోన్ జాక్ ఉండదు కానీ అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ ఉంటుంది.

ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత ColorOS 13లో రన్ అవుతుంది.ఒప్పో కంపెనీ ఇంకా లాంచ్ డేట్‌ని కన్ఫామ్ చేయాల్సి ఉంది.కానీ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.30,000-32,000 ఉంటుందని అంచనా.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు