ఆస్ట్రేలియా లోని భారత ఎన్నారైల ఆన్లైన్ పిటిషన్...ఎందుకంటే..

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో దేశాలు తమ దేశంలోకి వచ్చే విదేశీయుల ఎంట్రీ పై ఆంక్షలు విధించగా, మరి కొన్ని దేశాలు అసలు విదేశీయులకు ఎంట్రీ నే లేదని తేల్చి చెప్పాయి.

మళ్ళీ కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత మాత్రమే తమ దేశాలలోకి వచ్చేందుకు అను మతులు ఇస్తామని ప్రకటించాయి.

దాంతో ఎంతో మంది భారతీయ ఎన్నారైలు ఆయా దేశాలకు వెళ్లేందుకు కొన్నేళ్లుగా ఆగాల్సి వచ్చింది.ఇప్పుడిప్పుడే కరోనా తగ్గు ముఖం పడుతున్న తరుణంలో దాదాపు అన్ని దేశాలు వలస వాసుల ఎంట్రీ పై విధించిన ఆంక్షలను సడలిస్తున్నాయి.

ఈ నేపధ్యంలోనే ఆస్ట్రేలియా తమ దేశంలో వలస వాసులు రావచ్చునని కీలక ప్రకటన చేసింది.దాంతో ఆస్ట్రేలియా లో ఉంటున్న భారత ఎన్నారైలు, భారత్ లోనే ఉండి పోయిన ఎన్నారైలు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఇటు భారత ప్రభుత్వానికి అటు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి తమ గోడు వెళ్ల గక్కు కున్నారు.ఆస్ట్రేలియాలోని సిడ్నీ కి వెళ్లేందుకు ముంబై నుంచీ నేరుగా విమాన సర్వీసులు నడపాలంటూ ఏకంగా ఆన్లైన్ లో పిటిషన్ నిర్వహించారు.

Advertisement

ఈ పిటిషన్ కు ఎన్నారైల నుంచీ భారీ స్పందన వచ్చింది.ఇంతకీ ఈ పిటిషన్ దేని కంటే ఎన్నారైలు భారత్ నుంచీ సిడ్నీ వెళ్ళాలంటే ముంబై నుంచీ లేదా ఢిల్లీ, బెంగుళూరు నుంచీ నేరుగా విమాన సర్వీసులు లేవు.

దాంతో ఎన్నారైలు సుమారు 20 గంటల నుంచీ 30 గంటల వరకూ ప్రయాణం చేయాల్సి వస్తోంది.దాంతో సమయం వృధా అవడంతో పాటు, టిక్కెట్టు రెట్లు, ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతోంది.

ప్రతీ ఏడూ ఆస్ట్రేలియా వచ్చే పర్యాటకులు కూడా ఈ ప్రయాణ భారంతో విసిగిపోతున్నారు.కాబట్టి దయచేసి ముంబై నుంచీ సిడ్నీ కి విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని change.org లో ఇరు దేశాల ప్రభుత్వాలని అభ్యర్ధించారు.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు