ఆందోళనలో అమెరికన్స్..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోయాయి.అధ్యక్షుడిగా బిడెన్ ను అధికారికంగా ప్రకటించక పోయినా అనధికారికంగా బిడెన్ అనే విషయం అందరికి తెలిసిందే.

అమెరికా వ్యాప్తంగా గడిచిన కొన్ని నెలలుగా ఎన్నికల మూలంగా కరోనా మహమ్మారి పై దృష్టి సారించలేక పోయింది ప్రభుత్వం.ఈ క్రమంలోనే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లైట్ తీసుకున్న ఎంతో మంది అమెరికన్స్ రోడ్లపై తిరగడం పాజిటివ్ నమోదు అయినా వారు కూడా ఎన్నికల సభలలో, ఓటు వేయడానికి పాల్గొనడంతో ఇప్పుడు ఈ మహమ్మారి వైరస్ మరో సారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.

Corona Cases Increased Due To Elections, America Elections, Coronavirus, 1 Lakh

జాన్ హాప్ కీన్స్ యూనివర్సిటీ ప్రకటించిన నివేదికలో భాగంగా 24 గంటల వ్యవధిలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.అంతేకాదు మహమ్మారి మరింత ముదరడంతో మరిన్ని కేసులు కూడా నమోదు అవుతున్నాయని అంటున్నారు ఇక ఒక్క రోజులో మరణించిన వారి సంఖ్య 1,112 గా నమోదు అయ్యిందని భవిష్యత్తులో అమెరికా ప్రజలు మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇదిలాఉంటే యూనివర్సిటీ పరిశోధకుల పరిశోధనల కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న సమయంలో కేవలం ఎన్నికల నేపధ్యంలోనే మరో సారి భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయని ప్రకటించింది.ఇప్పటి వరకూ 94 లక్షల మంది అమెరికన్స్ కరోనా వైరస్ బారిన పడగా అందులో 2.40 లక్షల మంది మృతి చెందారు, ఇప్పటికైనా ప్రభుత్వాలు మరీ ముఖ్యంగా అమెరికన్స్ జాగ్రత్తలు తీసుకోక పొతే భవిష్యత్తులో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశోధకులు.తాజాగా ఒక్క రోజులో లక్షకు పైగా కేసులు నమోదు కావడంతో అమెరికన్స్ ఆందోళన చెందుతున్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తాజా వార్తలు