ఒక్క బిస్కెట్ తక్కువయ్యిందని రూ. లక్ష రూపాయిలు జరిమానా వేశారు!

వినడానికి కాస్త విడ్డూరంగా వున్నా మీరు ఇక్కడ విన్నది నిజమే.

దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ( FMCG company ) ఐటీసీ ఒకే ఒక్క బిస్కెట్ కోసం రూ.

లక్ష రూపాయిలు చెల్లించుకుందంటే మనం నమ్మి తీరాల్సిందే.అవును, దేశంలోనే అతిపెద్ద బిస్కెట్ తయారీ కంపెనీ అయినప్పటికీ ఐటీసీ సంస్థ బిస్కెట్ ప్యాకింగ్‌లో మాత్రం విఫలమైంది.

కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని సన్‌ఫీస్ట్ మేరీ లైట్( Sunfeast Mary Light )లో 16 బిస్కెట్లకు బదులు 15 మాత్రమే ప్యాక్ చేయడంతో చెన్నైకి చెందిన ఓ వినియోగదారుడికి ఏకంగా రూ.లక్ష జరిమానా చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించడం కొసమెరుపు.

విషయంలోకి వెళితే, చెన్నైకి( Chennai ) చెందిన ఢిల్లీబాబు అనే వ్యక్తి 2021, డిసెంబర్‌లో ఒక రిటైల్ స్టోర్ నుంచి సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ కొనడం జరిగింది.ప్యాకెట్ పైన 16 బిస్కెట్లు అని రాసి వుంటే తెరిచి చూడగా అతనికి 15 బిస్కెట్లు మాత్రమే కనిపించాయి.దీనిపై వివరణ కోరిన ఢిల్లీ బాబుకి ఐటీసీ సరైన విధంగా స్పందించలేదు.దాంతో ఒక్కో బిస్కెట్ ఖరీదు 75 పైసలు అని, ఐటీసీ రోజుకు దాదాపు 50 లక్షల ప్యాకెట్లను తయారు చేస్తుందని, ఎన్వలప్ లెక్కల ప్రకారం ప్రజలను రూ.29 లక్షలకు పైగా మోసం చేసిందంటూ వినియోగదారుల కోర్టుకు ఫిర్యాదు చేశారు.

Advertisement

ఈ విషయాన్ని బాగా పరిశీలించిన వినియోగదారుల కోర్టు.ప్యాకేట్‌పై ఉన్న విధంగా కాకుండా బిస్కెట్ల సంఖ్య ( Number of Biscuits )తక్కువగా ఉండటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.ప్యాకెట్‌పై ఉన్నదానికంటే ఒకటి తక్కువగా ఉండటాన్ని తప్పుబట్టడమే కాకుండా, ప్రకటనల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు గాను వినియోగదారుడికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని బల్లగుద్ది మరీ ఆదేశించింది.అంతేకాకుండా, ఆ బ్యాచ్ బిస్కెట్ల తయారీని వెంటనే నిలిపేయాలని కూడా పేర్కొంది.

దాంతో సదరు కంపెనీ వాడు చచ్చినట్టు వినియోగదారుడుకి నస్ట పరిహారం చెల్లించుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు