ప్రెగ్నెన్సీ టైమ్‌లో పొట్టపై విప‌రీతంగా దుర‌ద వ‌స్తుందా.. అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

వివాహం అనంతరం మహిళల్లో చాలా మంది ప్రెగ్నెన్సీ( Pregnancy ) కోసం ఆరాటపడుతూ ఉంటారు.అయితే కొందరికి ప్రెగ్నెన్సీ సమయం అనేది హుషారుగా సాగుతూ ఉంటుంది.

 Simple Tips To Get Rid Of Itchy Belly During Pregnancy! Simple Tips, Itchy Bell-TeluguStop.com

ఎన్నో కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.కానీ కొందరు మాత్రం ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు, వికారం, తల తిరగడం.

ఇలా అనేక సమస్యలను ఫేస్ చేస్తారు.అలాగే కొందరికి పొట్టపై విపరీతంగా దురద పుడుతుంటుంది.

ముఖ్యంగా ఆరు ఏడో నెల నుంచి ఈ సమస్య స్టార్ట్ అవుతుంది.కడుపులో బిడ్డ ఎదిగే క్రమంలో పొట్ట సాగుతుంది.

దాంతో చర్మం పొడిబారుతుంది.

Telugu Tips, Itchy Belly, Latest, Pregnancy, Pregnant, Simple Tips-Telugu Health

అలాగే హార్మోన్ చేంజ్, రక్తప్రసరణ ఎక్కువగా జరగడం తదితర కారణాల వల్ల పొట్ట పై విపరీతంగా దురద( Itching ) వస్తుంటుంది.ఆ క్ర‌మంలోనే పొట్టను తెగ గోకేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల చారలు, పుండ్లు వంటివి పడుతుంటాయి.

కానీ ఇప్పుడు చెప్పుబోయే సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే దురద నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది.మ‌రి లేటెందుకు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

Telugu Tips, Itchy Belly, Latest, Pregnancy, Pregnant, Simple Tips-Telugu Health

ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట‌పై దుర‌ద‌ను తగ్గించడానికి విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను పొట్టపై వేసి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.నిత్యం ఇలా చేస్తే చర్మం తేమగా మారుతుంది.దీంతో దురద తగ్గుతుంది.అలాగే స్నానం చేసేటప్పుడు సోప్స్ కు బదులుగా సున్నిపిండి, మీగడ ఉపయోగించండి.ఇవి దురద ను తగ్గిస్తాయి.

చర్మాన్ని సున్నితంగా మారుస్తాయి.చర్మంపై బాగా దురద పెడుతున్నప్పుడు గోకటం మానేసి అలోవెరా జెల్ ( Aloe Vera Gel )ను అప్లై చేసుకోండి.

ఈ జెల్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దురద నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి.పొట్టపై దురద వస్తున్నప్పుడు మెత్తని తడి క్లాత్ ను తీసుకోండి.

పొట్టపై పరిచి సున్నితంగా తుడవండి.ఇలా చేసినా దురద నుండి ఉపశమనాన్ని పొందుతారు.

ఇక రోజు నైట్ నిద్రించేముందు రసాయనాలు తక్కువగా ఉండే మాయిశ్చరైజ‌ర్ ను పొట్ట మీద అప్లై చేసుకోండి.ఇలా చేసినా దురద రాకుండా ఉంటుంది.

మరియు స్ట్రెచ్‌ మార్క్స్ ఏర్పడకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube