కాలువల పూడికతీత కమిటీ చైర్మన్ గా ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) గ్రామ ప్రజల ఆయకట్టు వరప్రదాయిని సింగ సముద్రం కు సంబంధించి ఎల్లారెడ్డిపేట లో గల సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల పూడికతీత పనుల కమిటీ చైర్మన్ గా ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ను స్థానిక సర్పంచ్ నెవూరి వెంకట్ రెడ్డి నియమించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) మాట్లాడుతూ సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల ను ఉపాధి హామీ కూలీల ద్వారా తీపించడం జరుగుతుందని అన్నారు.

కాలువ పూడిక తీత విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే తన ఫోన్ నంబర్ 9059519691 కు ఫోన్ చేయాలని ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు.ఉపాధి కూలీలు ఎక్కువ మొత్తంలో కాలువల పూడిక తీత కు రావాలని సకాలంలో నీటిని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి సహకారంతో తొందరలోనే విడుదల చేసుకోవడానికి ప్రతి ఒక్క రైతు సహకరించాలని ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు.

హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు.. తెలుసా?

Latest Rajanna Sircilla News