తారక్ నెక్స్ట్ సినిమాపై కీలక అప్డేట్... సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్30

నందమూరి హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరామ్ భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తారక్ ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

NTR30 Movie Big Announcement, Trivikram Srinivas, RRR Movie, Koratala Siva, Acha

ఈ సినిమా షూటింగ్ మే, జూన్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.త్వరలో దీనికి సబందించిన అప్డేట్ కూడా వస్తుందని చిత్ర నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమా గురించి కీలక అప్డేట్ రానుందని తెలుస్తుంది.

Advertisement

ఈ నేపధ్యంలో ఎన్టీఆర్30 అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.గతంలో జనతా గ్యారేజ్ తర్వాత తారక్, కొరటాల కాంబినేషన్ లో మరో మూవీ వస్తుందని అందరూ భావించారు.

అయితే ఆ టైంలో అది సెట్ కాలేదు.అయితే ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా రాబోతుందని తెలుస్తుంది, ఇక ఈ సినిమా ద్వారా కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ పూర్తి స్థాయి నిర్మాతగా మారుతున్నాడు.

యువసుధ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.ఈ కాంబినేషన్ గురించే ఈ రోజు అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీకి సంబంధించి టైటిల్ లేదంటే హీరోయిన్ ప్రకటన ఉండే అవకాశం ఉందని మరో టాక్ కూడా నడుస్తుంది.అయితే వీటిలో ఏంటి అనేది ఈ రోజు తెలిసే అవకాశం ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు