Senior NTR : ఆ ఇద్దరి దర్శకుల పోటీ తత్వం వల్ల అనేక రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్..!

నందమూరి తారక రామారావు( Nandamuri Tarak Rama Rao ).

ఈ పేరు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు ఈ చలనచిత్ర పరిశ్రమలు కూడా పరిచయం అక్కరలేని పేరు.

జానపద, పౌరాణిక, కుటుంబ ఇలా ఏ కథ అయినా సరే పాత్రలో తలకాయ ప్రవేశం చేసి నటించడం ఆయన నటనకు మాత్రమే సాధ్యం.ఇకపోతే ఎన్టీఆర్ ఎదుగుదలలో ఇద్దరు అగ్ర దర్శకులు వారి పోటీతత్వం వల్ల ఆయనకు ఎన్నో విజయాలను కట్టబెట్టారు.

వారెవరో కాదు దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు.వీరిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ తో పోటాపోటీగా అనేక సినిమాలు తీస్తూ మంచి కమర్షియల్ హిట్ లను సాధించి అనేక విజయాలను సాధించారు.

మనుషులంతా ఒకటే అనే సినిమాతో మొదలైన వీరి ప్రస్థానం వరుసగా పదేళ్లపాటు అనేక విజయాలను అందుకున్నారు.

Advertisement

1976లో మనుషులంతా ఒక్కటే( Manushulantha Okkate ) అనే సినిమాతో దాసరి నారాయణరావు ఎన్టీఆర్ తో సినిమా తీయగా.అప్పట్లో ఆ సినిమా పెద్ద కమర్షియల్ విజయం సాధించింది.తర్వాత సంవత్సరమే అడవి రాముడు చిత్రంతో రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో కలిసి మరో కమర్షియల్ హిట్ సాధించారు.

ఈ సినిమా తర్వాత డ్రైవర్ రాముడు, సింహబలుడు, కేడి నెంబర్ వన్ లాంటి పలు చిత్రాలతో ఎన్టీఆర్ రేంజ్ ని మరింత పెంచాడు రాఘవేంద్రరావు.ఇలా కేవలం రెండు సంవత్సరాల్లో ఎన్టీఆర్ తో రాఘవేంద్రరావు( Raghavendra Rao ) ఏకంగా ఐదు సినిమాలను చిత్రీకరించి విడుదల చేయడమే కాకుండా అన్ని సినిమాలు విజయం సాధించారు.

ఇక దాసరి విషయానికొస్తే.మనుషులంతా ఒక్కటే సినిమా తర్వాత ఏకంగా నాలుగు సంవత్సరాల తర్వాత గాని ఆయనకు ఎన్టీఆర్ తో సినిమా తీసే అవకాశం రాలేదు.1980లో సర్కస్ రాముడు అనే సినిమాని తీయగా ఆ సినిమా ఆశించినంత విజయం అందుకోలేకపోయింది.

ఆ వెంటనే ఎన్టీఆర్ సినిమాలలో ప్రసిద్ధిగాంచిన సర్దార్ పాపారాయుడు( Sardar Paparaudu ) చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించడంతో బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా నిలిచింది.ఆపై విశ్వరూపం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి సినిమాలో ఒకదాని తర్వాత ఒకటి రావడంతో ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారి ఆకాశం అంచులకు చేరింది.ఈ ప్రస్థానంలో ఎన్టీఆర్ అనేక అవార్డులను అందుకున్నారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

అయితే ఇది విజయం పరంపరని కొనసాగిస్తూ దాసరి నారాయణరావు ఎన్టీఆర్ తో బొబ్బిలి పులి సినిమాకి శ్రీకారం చుట్టి అతి తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేసి విడుదల చేయగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక ప్రభంజనం సృష్టించింది ఆ సినిమా.

Advertisement

ఇక చివరిగా 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ రాఘవేంద్రరావు( Raghavendra Rao )తో కలిసి మేజర్ చంద్రకాంత్( Major Chandrakanth ) సినిమా చేసి మరో అద్భుత విజయాన్ని అందుకున్నారు.అయితే ఇలా రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు ఇద్దరు ఎన్టీఆర్ తో కలిసి పోటీ పోటీగా సినిమాలు తీస్తూ విజయాలు అందుకోవడం.సినిమా చరిత్రలో అరుదుగా కనపడుతుంది.

ఇలా ఇద్దరు పెద్ద డైరెక్టర్లు పోటీ పడకుండా.స్పోర్టివ్ తనంతో తీసుకుంటూ ఎన్టీఆర్ తో అనేక సినిమాలు తీస్తూ ఎలాంటి మనస్పర్ధలకు లోనవ్వకుండా తెలుగు చిత్ర ప్రేమికులకు అనేక సినిమాల అందించారు.

ఇంతే స్పోర్టివ్గా ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు కూడా సినిమాలు తీస్తే అనేక మంచి విజయాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో మనం చూడొచ్చు.

తాజా వార్తలు