ప్రొమోషన్స్ లో తారక్ టైమింగ్ కి ఫిదా.. పంచులతో అలరిస్తున్న ఎన్టీఆర్..

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా రిలీజ్ త్వరలోనే ఉంది.

మరొక 8 రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా కోసం మరింత ఆతృతగా ఎదురు చూస్తున్నారు.దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆశగా చూస్తున్నారు.

Advertisement

రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమా గురించి ఒక్కో వార్త బయటకు వస్తుంటే మరింత ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది.ఇక మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా వాళ్ళ అభిమాన హీరో సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.దీంతో మొదటి రోజే రికార్డుల మోత మోగించేందుకు ఆస్కారం ఉందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు మేకర్స్.రాజమౌళి, చరణ్ తో పాటు ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు.ఇక ఈ ప్రొమోషన్స్ లో చరణ్ ఎప్పటిలాగానే సైలెంట్ గా ఉంటుంటే.

ఎన్టీఆర్ మాత్రం తన ఎనర్జీ మరింత బయటకు తీస్తూ ప్రొమోషన్స్ లో కూడా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

ప్రొమోషనల్ ఇంటర్వ్యూలు కూడా బోర్ కొట్టకుండా చేస్తున్నారు.తన కామెడీ టైమింగ్ తో ఆ రేంజ్ లో అలరిస్తున్నాడు తారక్.నిన్న ఇంకో కొత్త వీడియోలో తన టైమింగ్ తో రాజమౌళి తో ఒక ఆట ఆడుకున్నాడు.

Advertisement

అలాగే చరణ్ తారక్ కి కాఫీ పెడతా అన్నప్పుడు నీ చేత్తో విషం పెట్టిన తాగేస్తా అని చెప్పడం ఈ ఇంటర్వ్యూ కే హైలెట్ గా నిలిచింది.ఇలా తారక్ అందరిని తన టైమింగ్ తో అలరిస్తున్నాడు.

తాజా వార్తలు