కంగ్రాట్స్ బాబాయ్....  బాలయ్యకు పద్మభూషణ్ విష్ చేసిన ఎన్టీఆర్... ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించడం సంగతి తెలిసిందే.

వివిధ రంగాలలో ఎంతో మంచి సేవలు అందించిన వాటిని గుర్తించి వారికి పద్మ అవార్డులను( Padma Awards ) అందచేయబోతున్నట్లు జాబితాను విడుదల చేశారు.

నేడు రిపబ్లిక్ డే కావడంతో కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది.ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలువురు ప్రముఖులకు కూడా ఈ పద్మ అవార్డులు రావటం విశేషం.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) కూడా పద్మభూషణ్( Padma Bhushan ) అవార్డుకు ఎంపిక అయ్యారు.

ఇలా పద్మ అవార్డుల జాబితాలో బాలయ్య పేరు ఉండటంతో ఎంతోమంది సినీ ప్రముఖులు బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోని నందమూరి వారసులు అయినటువంటి ఎన్టీఆర్( NTR ), కళ్యాణ్ రామ్( Kalyan Ram ) సైతం సోషల్ మీడియా వేదికగా తన బాబాయికి శుభాకాంక్షలు తెలియజేశారు.బాలయ్య ఈ అవార్డుకు ఎంపిక అయ్యారనే విషయం తెలియగానే ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.

Advertisement

ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు.ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి, మీ అవిశ్రాంత సేవకు నిదర్శనమని తెలిపారు.

ఇక కళ్యాణ్ రామ్ కూడా స్పందిస్తూ.ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ అవార్డుని అందుకున్నందుకు నా బాబాయ్‌ నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక అభినందనలు.ఈ గౌరవం మీరు సినిమా ప్రపంచానికి చేసిన అసాధారణ కృషికి, సమాజ సేవలో చేసిన అవిశ్రాంత కృషికి నిజమైన గుర్తింపు అని కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు తెలిపారు.

ఇలా బాబాయ్ కి అవార్డు రావడంతో అబ్బాయిలు ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపడంతో వీరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని గత కొంతకాలంగా వీరి మధ్య మాటలు లేవు అంటూ అభిమానులు ఎంతో ఆవేదన చెందారు కానీ ఇలా వీరిద్దరూ తమ బాబాయ్ కి శుభాకాంక్షలు చెప్పడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

బాలయ్యకు పద్మభూషణ్.... శుభాకాంక్షలు చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు