ట్విట్టర్ యూజర్లకు శుభవార్త​​.. ఇక నుండి మీ ట్వీట్ లో 2,500 వరకు టెక్స్ట్ చేయొచ్చు​!

పరిచయం అక్కర్లేని సామాజిక మాద్యమం ట్విట్టర్‌. త్వరలో ఇందులో ఓ భారీ మార్పు రాబోతోంది.

అవును.యూజర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న అప్డేట్ రాబోతోంది.

అదేమంటే ఇకపై ఒక ట్వీట్‌లో 2,500 అక్షరాల వరకు కంపోజ్ చేసుకునే అవకాశం యూజర్లకు ట్విట్టర్ కల్పించనుంది.ఇన్నాళ్లూ 280 అక్ష‌రాల వరకు మాత్రమే లిమిట్ వుంది.

ఇపుడు అది కాస్త 280 నుంచి ఏకంగా 2,500కు పెంచాల‌ని ట్విట్టర్ యోచిస్తోంది.ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.త్వరలోనే మన ఇండియా ట్విట్టర్ యూజర్లు దీన్ని వినియోగించుకోనున్నారు.

Advertisement
Now You Can Compose Upto 2500 Letters In Twitter Details, Twitter, Account, User

ఇకపోతే ఇప్ప‌టికే అమెరికా, UK, కెన‌డా, ఘ‌నా వంటి దేశాల్లో ఈ అప్డేట్ ప్ర‌యోగాత్మ‌కంగా అమలవుతోంది.మొదట్లో ఒక ట్వీట్ క్యారెక్ట‌ర్ల ప‌రిమితి కేవలం 140 మాత్రమే వుండేదనే విషయం తెలిసినదే.

అయితే దీన్ని 2017 తర్వాత 280కి పెంచడం జరిగింది.అదికాస్తా ఇప్పుడు 2,500కి పెరగబోతోంది.

ఈ కొత్త ఫీచర్ ని ‘నోట్స్’ అని అంటారు.దీని సాయంతో ఎస్సే (వ్యాసం) మాదిరి పెద్ద పెద్ద రైటప్ లను ఒక లింక్ రూపంలో షేర్ చేసుకోవచ్చు.

ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా ఈ ఫీచర్ ని వాడుకోవచ్చు అని ట్విట్టర్ చెబుతోంది.

Now You Can Compose Upto 2500 Letters In Twitter Details, Twitter, Account, User
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..

కొత్త అప్డేట్ అందుబాటులోకి వచ్చిన తరువాత 2500 పదాల కంటెంట్ తోపాటు ఫొటోలు, వీడియోలు, జిఫ్ లతో కూడిన భారీ సైజ్ పోస్టులను యూజర్లు రాసుకోవచ్చు, పబ్లిష్ చేయొచ్చు, అలాగే షేర్ కూడా చేసుకోవచ్చు.‘నోట్స్’కి సంబంధించిన నోట్ కార్డు ట్విట్టర్ టైమ్ లైన్ లో ఒక ట్వీట్ లాగా కనిపిస్తుంది.‘నోట్స్’కి ప్రత్యేకమైన URLS ఉంటాయి.

Advertisement

కాబట్టి ట్విట్టర్ లో లాగిన్ అయినా కాకపోయినా అసలు ట్విట్టర్ అకౌంటే లేకపోయినా కూడా వాడుకోవచ్చు.కాబట్టి ఇదొక మంచి పరిణామమనే చెప్పుకోవాలి.

తాజా వార్తలు