సాయి పల్లవి పై ఎందుకు ఇంత విమర్శ... సీత పాత్రకు ఆమె చేసిన ద్రోహం ఏంటి ..?

రామాయణం సినిమా అనగానే ఎంతో పరమ పవిత్రతతో కూడిన ఒక సినిమాగా భావిస్తూ ఉంటారు.

అలాగే రామాయణం సినిమాలో సీత పాత్ర ఎవరు చేస్తున్నారు అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.

గతంలో నయనతార ( Nayanthara )హీరోయిన్ గా సీత పాత్రలో శ్రీరామరాజ్యం సినిమా( Sri Rama Rajyam Movie ) చేసినప్పుడు అందరూ పెదవి విరిచారు.ఒక వ్యాంపు లాంటి పాత్ర చేసే నటితో సీత పాత్ర ఏంటి అంటూ విరుచుకుపడ్డారు కానీ బాపు తీసిన రామాయణం విడుదలైన తర్వాత అందరూ ముక్కుపై వేలేసుకున్నారు.

అంతలా నయనతార ఆ పాత్రలో మెప్పించ గలిగింది పైగా దర్శకుడు నటిని ఎలా తీర్చిదిద్దుతున్నాడు అనే విధానం పైనే ఆధారపడి ఉంటుంది.

North Actors Trolls On Sai Pallavi , Sai Pallavi, Ramayana, Bollywood, Nayanth

మట్టి ముద్దలాంటి నటులను వారికి అద్దే పాత్రలు ఇచ్చి అందంగా చేయించుకోవడం దర్శకులపైనే ఆధారపడి ఉంటుంది.మరి ఇప్పుడు నార్త్ రామాయణం పై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి.సీత పాత్ర, అలాగే రాముడు పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి రణబీర్ కపూర్( Ranbir kapoor ) పై కూడా కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

Advertisement
North Actors Trolls On Sai Pallavi , Sai Pallavi, Ramayana, Bollywood, Nayanth

ముఖ్యంగా గతంలో టీవీలో సీరియల్ గా రామాయణం టెలికాస్ట్ అయినప్పుడు లక్ష్మణుడి పాత్రలో నటించినా సునీల్ లాహ్రి సాయి పల్లవి నీ సీతగా ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదు అంటున్నాడు.ఆమె నటనను చూడలేదు ఆమె నటించ సినిమాలు చూడలేదు కానీ ఆమె మొహం లో పరిపూర్ణత కనిపించడం లేదట సదరు నటుడుకి.

ఇతడికి నార్త్ హీరోయిన్స్ ఐన దీపిక, ప్రియాంక, కంగనా లాంటి వారు చేస్తే బాగుంటుందేమో మరి.అసలు సాయి పల్లవి నటన చూడకుండా సినిమాలు చూడకుండా ఆమె ఎంపిక సరైనది కాదు అనడం ఆ నటుడి అవివేకాన్ని చూపిస్తుంది.

North Actors Trolls On Sai Pallavi , Sai Pallavi, Ramayana, Bollywood, Nayanth

ఇక రణబీర్ కపూర్ అనిమల్ సినిమా( Animal) తర్వాత ఇలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులు ఒప్పుకోరట.అసలు నవ్వొచ్చే విధంగా ఉన్నాయి ఈ నటుడు వ్యాఖ్యలు.ఇక సీత పాత్రలో నటిచ్చిన దీపికా చికిలియా సైతం అసలు రామాయణాన్ని ఎవరు ప్రయత్నించకపోవడమే ఉత్తమం అటుంది.

ఆదిపురుష్ చూసిన అనుభవంతో ఇలా మాట్లాడుతుంది.మరి సునీల్, దీపికా లాంటివారు అంతకన్నా ముందు చిల్లర వేషాలు వేసిన వారే ఆ సీరియల్ తర్వాత కూడా వారు పెద్దగా మెప్పించిన పాత్రలు ఏమీ లేవు.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

ఆయన సాయి పల్లవిని తప్పు పట్టే అర్హత వారెవరికీ లేదు.నార్త్ రామాయణం తీస్తున్న దర్శకుడు కూడా అల్లాటప్ప వ్యక్తి కాదు.

Advertisement

దంగల్ లాంటి సినిమా తీసిన అనుభవశాలి.గతంలో అంజలీదేవి సీత పాత్రలో నటించిన తర్వాత మిగతావారు ఇప్పించలేదా అంటే చంద్రకళ అద్భుతంగా చేసింది.

చాలా భాషల్లో చాలా మంది ఎంతో చక్కగా చేశారు.ఏ పాత్ర ఎవరికీ దక్కాలో వారికే దక్కుతుంది.

ఎలాంటి మకిలి అంటించుకోనీ సాయి పల్లవికి సీత పాత్ర వెతుక్కుంటూ వచ్చింది.

తాజా వార్తలు