తెలుగింటి కోడలైనా తెలుగు రాష్ట్రాలు కనిపించలేదాయే

తెలుగు రాష్ట్రాలకు ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగింది.

పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది తెలుగు ఇంటి కోడలు నిర్మలా సీతారామన్‌ అయినా కూడా తెలుగు రాష్ట్రాల వ్యధలు ఆమెకు పట్టినట్లుగా లేవు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రధానంగా కోరుకుంటున్న కేటాయింపులు అస్సలు కనిపించలేదు.ముఖ్యంగా విభజన చట్టంలో ఉన్న కేటాయింపులు ఇప్పటి వరకు ఏపీకి మరియు తెలంగాణకు కేటాయించలేదు.

ఈసారి కూడా ఆ కేటాయింపులు కనిపించలేదు.తెలుగు రాష్ట్రాల వ్యధలు పట్టని మంత్రుల జాబితాలో నిర్మల కూడా చేరిపోయారు అంటూ తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి విశాఖ రైల్వే జోన్‌ విషయమై ఎలాంటి హామీ దక్కలేదు.అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్ట్‌లకు కేంద్రం ఇవ్వబోతున్న నిధుల విషయాన్ని కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు.

Advertisement

దాంతో తెలుగు రాష్ట్రాల ప్రాజెక్ట్‌ల విషయంలో కేంద్రం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తేలిపోయింది.ఇక ఏపీ రాజధాని కోసం కేంద్రం నుండి రూపాయి కూడా కేటాయింపులు లేవు.

మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ఏమీ లేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు