బడ్జెట్‌పై ప్రధాని కామెంట్‌

కేంద్రం నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నారు.

కాని ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం తమ బడ్జెట్‌ అద్బుతంగా ఉందని అన్ని వర్గాల వారికి ఇది ఆమోదయోగ్యంగా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యలను ప్రాలదోలే విధంగా బడ్జెట్‌ ఉందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.ముఖ్యంగా విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు ఈ బడ్జెట్‌ పెద్ద పీఠ వేసినట్లుగా ఈ సందర్బంగా మోడీ పేర్కొన్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యం నెలకొల్పేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన బ్రిడ్జ్‌ కోర్స్‌లను ఏర్పాటు చేసేందుకు కేటాయింపులు చేశాం.దాంతో లక్షలాది మంది నిరుద్యోగులు స్వయం ఉపాది పొందడంతో పాటు అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఇక ప్రజల ఆరోగ్యం కోసం భారీ ఎత్తున కేటాయింపులు చేశామన్న ప్రధాని రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు తీసుకు రావడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేందుకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేశామంటూ ప్రధాని చెప్పుకొచ్చారు.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు