మహేష్ బాబు కి తల్లి గా నటించిన ఈ నటి ఎవరో తెలిస్తే అవాక్కవుతారు...

కొంతమంది నటీనటులు వచ్చి రావడంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకొని ఆ తర్వాత బాలీవుడ్ కోలీవుడ్ కి వెళ్ళిపోయిసెటిలైన నటీనటులు సినిమా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.

ఇందులో ప్రముఖ నటి "తళ్లూరి రామేశ్వరి" ఒకరు.

అయితే నటి తాళ్లూరి రామేశ్వరి అంటే పెద్దగా ప్రేక్షకులకు తెలియకపోవచ్చుగానీ 2003వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన "నిజం" చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించిన "రామేశ్వరి" అంటే ప్రేక్షకులను బాగానే గుర్తు పడతారు.అయితే నటి రామేశ్వరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది.

తన చదువులు పూర్తయిన తరువాత సినిమాల్లో అవకాశాల కోసం బాగానే ప్రయత్నించింది.ఈ క్రమంలో 1978 సంవత్సరంలో తెలుగు ప్రముఖ సీనియర్ నటుడు మరియు దర్శకుడు కే.

విశ్వ నాధ్ తెరకెక్కించిన "సీతామాలక్ష్మి" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకుంది.దీంతో రామేశ్వరి కి తన మొదటి చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.

Advertisement
Nijam Movie Fame Talluri Rameshwari Background And Movie Career, Talluri Rameshw

దీంతో రామేశ్వరి కి సినిమా అవకాశాలు బాగానే క్యూ కట్టాయి.కానీ సీతామాలక్ష్మి చిత్రంలో నటించిన తరువాత నటి రామేశ్వరి తెలుగులో పెద్దగా నటించలేదు.

కానీ హిందీలో మాత్రం వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది.ఈ క్రమంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన దీపక్ సేథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది.

ఆ తరువాత "నిజం" చిత్రంలో హీరో తల్లి పాత్రలలో నటించి ఫిలింఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డు కూడా అందుకుంది.

Nijam Movie Fame Talluri Rameshwari Background And Movie Career, Talluri Rameshw

నటి రామేశ్వరి తెలుగు, హిందీ, ఒడియా, తదితర భాషలలో కలిపి దాదాపుగా 25 కు పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.కానీ నటి రామేశ్వరి కి నటిగా మంచి గుర్తింపు దక్కింది మాత్రం టాలీవుడ్ లోనే.ఎందుకంటే తెలుగులో రామేశ్వరి నటించిన నిజం, సీతామాలక్ష్మి, తదితర చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా తన నటనకి రెండు నంది అవార్డులు, రెండు ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

అయితే నటి రామేశ్వరి కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లి తెరపై కూడా నటించి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.ఆమధ్య తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన జీ తెలుగులో ప్రసారమయ్యే "అమెరికా అమ్మాయి" ధారావాహికలో హీరో తల్లి పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు