పెరుగుతున్న వ్యవస్ధీకృత నేరాలు .. భారత్‌ నుంచే కంట్రోలింగ్ అంటూ కెనడా పోలీసుల అనుమానాలు

కెనడా పోలీసులు( Canada ) ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న దోపిడీలు, సంబంధిత నేరాలను దర్యాప్తు చేస్తున్నారు.

అల్బెర్టాలోని ఎడ్మోంటన్‌లో నేరస్తులు వుండే అవకాశం వుందని భావిస్తున్నారు.

వారు ఈ ప్రాంతంలోని సంపన్నమైన దక్షిణాసియా ప్రజలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు.అగంతకులు వాట్సాప్ ద్వారా బాధితులకు సందేశం పంపి, డబ్బు డిమాండ్ చేస్తున్నారు.

బ్రిటీష్ కొలంబియా, అంటారియోలలో ఇలాంటి ఘటనలో నమోదయ్యాయి.అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ తరహా 27 ఘటనలు చోటు చేసుకున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయని ఎడ్మోంటన్ పోలీసులు తెలిపారు.

వీటిలో దోపిడీలు, దహనం, డ్రైవ్ బై షూటింగ్‌లు వున్నాయి.

Advertisement

భారత్‌లోని ఓ అనుమానితుడు అక్కడి నుంచి ఇక్కడి ముఠాల ద్వారా ఈ నేరాలకు పాల్పడినట్లుగా తాము భావిస్తున్నట్లు ఎడ్మోంటన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ లాన్స్ పార్కర్ విలేకరులతో అన్నారు.కాల్పులు, ఆయుధ నేరాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పార్కర్ చెప్పారు. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదు.అయితే దాదాపు 6.7 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లుగా పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనల వెనుక సదరు భారతీయుడితో వున్న లింక్‌పై మరిన్ని వివరాలు వెల్లడించానికి పోలీసులు నిరాకరించారు.

కెనడా ఫెడరల్ పోలీసులు, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

కాగా.గతేడాది బ్రిటిష్ కొలంబియాలో జరిగిన సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్యకు భారతీయ ఏజెంట్లకు సంబంధం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.

కానీ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా అధికారులు ఇప్పటి వరకు ఎవరిపైనా అభియోగాలు మోపలేదు.కెనడియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

ఆ దేశ జనాభాలో దాదాపు 4 శాతం మంది భారతీయ వారసత్వానికి చెందినవారే.

Advertisement

తాజా వార్తలు