బ్యాంకింగ్‌ రంగంలో సరికొత్త సంచలనం... కార్డు లేకుండానే మొబైల్‌తో ఏటీఎంలో డబ్బు తీసుకోవచ్చు

పెరుగుతున్న టెక్నాలజీని బ్యాంకులు వేగంగా తమ వినియోగదారులకు అందిస్తున్నాయి.ఇప్పటికే క్యాష్‌ లెస్‌ ట్రాన్జక్షన్స్‌ను అందిస్తున్న బ్యాంకులు ఏటీఎంల పరిమితిని పెంచాయి.

ఇక ఏటీఎం కార్డు క్యారీయింగ్‌ అవసరం లేకుండా సరికొత్త విధానంను తీసుకు వస్తున్నాయి.విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న కార్డు లేస్‌ క్యాష్‌ విత్‌డ్రా ఇండియాలో ప్రారంభం అయ్యింది.

ఇండియాలోనే అతి పెద్ద బ్యాంకింగ్‌ రంగ సంస్థ అయిన ఎస్‌బీఐ తాజాగా ఈ సరికొత్త విత్‌డ్రాయల్‌ పద్దతిని తీసుకు వచ్చింది.దేశంలో ప్రస్తుతం ఉన్న తమ అన్ని ఏటీఎంలలో కూడా ఈ కొత్త విధానంతో విత్‌ డ్రా చేసుకునే విధంగా సాఫ్ట్‌ వేర్‌ను తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

New Future In Banking Is Card Less Banking For Atm Money

కార్డ్‌ లేకుండా క్యాష్‌ విత్‌డ్రాయల్‌ను యోనో క్యాష్‌ పాయింట్‌గా పేర్కొంటారు.యోనో క్యాష్‌ పాయింట్‌ విధానం మొబైల్‌లో యాప్‌ ద్వారా పని చేస్తుంది.స్మార్ట్‌ ఫోన్‌ ఉండి ఈ యాప్‌ను కలిగి ఉన్న వారు ఇకపై ఏటీఎంకు వెళ్లినా కార్డు అవసరం లేదు.

Advertisement
New Future In Banking Is Card Less Banking For Atm Money-బ్యాంకి�

ఇంట్లోనే కూర్చుని ఎంత మొత్తంలో డబ్బు కావాలి అనే విషయాన్ని నమోదు చేసుకుంటే ఒక పిన్‌ నెంబర్‌ వస్తుంది.ఆ పిన్‌ నెంబర్‌ను ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నమోదు చేసినట్లయితే వెంటనే డబ్బు తీసుకోవచ్చు.

ఈ పిన్‌ నెంబర్‌ 30 నిమిషాలు మాత్రమే పని చేస్తుంది.ఆ తర్వాత అది ఆటోమెటీక్‌గా డీయాక్టివేట్‌ అవుతుంది.

New Future In Banking Is Card Less Banking For Atm Money

ఈ విధానంలో క్యాష్‌ను విత్‌ డ్రా చేసుకోవాలనుకునే వారు మొదట ఈ స్టెప్స్‌ను చూడండి.తమ స్మార్ట్‌ ఫోన్‌లోయోనో ఎస్‌బీఐ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.ఆ తర్వాత దాన్ని రిజిస్ట్రర్‌ చేసుకోవాలి.

యాప్‌లో అకౌంట్‌ నెంబర్‌తో రిజిస్ట్రర్‌ చేసిన తర్వాత మనకు ఒక పిన్‌ నెంబర్‌ వస్తుంది.ఆ పిన్‌ నెంబర్‌ను గుర్తు పెట్టుకుని, మీకు ఎంత అమౌంట్‌ అయితే కావాలో అంత అమౌంట్‌ను అందులో ఎంటర్‌ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

ఆ తర్వాత ఏటీఎంకు వెళ్లి యోనో అపక్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

Advertisement

అక్కడ మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత పాస్‌వర్డ్‌ ను కూడా ఎంటర్‌ చేయాలి.మీరు మొబైల్‌లో ఎంత మొత్తంలో అయితే విత్‌ డ్రా చేయాలని ఎంటర్‌ చేశారో అంత మొత్తం మీకు బయటకు వస్తుంది.

అయితే ఈ పద్దతిలో కాస్త సమస్య ఉంది.జాగ్రత్తగా లేకుంటే ఇతరులు మీ ఫోన్‌ను హ్యాక్‌ చేసి మీ నెంబర్‌ను వెంటనే తీసుకుని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

అందుకే ఈ పద్దతి వాడాలనుకునే వారు కాస్త జాగ్రత్తగా తమ స్మార్ట్‌ ఫోన్‌ను ఉంచుకుంటే బెటర్‌.

తాజా వార్తలు