విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల తర్వాత నోటా, ట్యాక్సీవాలా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నోటా చిత్రం ఫ్లాప్ అవ్వగా ట్యాక్సీవాలా చిత్రం ఒక మోస్తరు సక్సెస్‌ను దక్కించుకుంది.
దాంతో మరోసారి గీత గోవిందం స్థాయి హిట్ కావాలని విజయ్ దేవరకొండ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు.అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈయన భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.ఆ చిత్రం సక్సెస్ కోసం విజయ్ దేవరకొండ తన పాత మూస పద్దతిని ఫాలో అయినట్లుగా సమాచారం అందుతోంది.

‘డియర్ కామ్రేడ్’ చిత్రం నుండి ఇటీవలే టీజర్ బయటకు వచ్చింది.టీజర్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది.తప్పకుండా సినిమా కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.టీజర్‌లోనే ఒక లిప్‌లాక్ సీన్‌ను చూపించిన యూనిట్ సభ్యులు సినిమాలో మరిన్ని లిప్‌లాక్ సీన్స్‌ను పెట్టి ఉంటారు అనే టాక్ వినిపిస్తుంది.
లిప్‌లాక్ సీన్స్ వల్ల విజయ్ దేవరకొండ గత చిత్రాలు సక్సెస్ అయ్యాయి.అవి లేని నోటా మరియు ట్యాక్సీవాలా చిత్రాలు అంతంత మాత్రంగా ఆడాయి.అందుకే ఈ చిత్రంలో లిప్‌లాక్ సీన్స్‌ను పెట్టినట్లుగా తెలుస్తోంది.

‘గీత గోవిందం’ చిత్రంలో ఉన్నవి రెండు లిప్‌లాక్ సీన్స్ అయినా కూడా సినిమా ప్రధానంగా లిప్‌లాక్ సీన్స్‌పై నడుస్తుంది.అందుకే గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయ్యింది.మరో వైపు డియర్ కామ్రేడ్ చిత్రంలో కూడా ముద్దు సీన్‌ను ఇరికించినట్లుగా కాకుండా కథలో బాగంగా ఉండేలా దర్శకుడు భరత్ కమ్మ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా కూడా అతి త్వరలోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.మే చివర్లో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మరి ముద్దు సీన్ విజయ్ దేవరకొండకు సక్సెస్‌ను తెచ్చి పెడతాయో చూడాలి.