గాడ్ ఫాదర్ సాంగ్ ఆ సాంగ్ కు కాపీనా.. థమన్ ఇది న్యాయమేనా అంటూ?

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ కు చేతినిండా ఆఫర్లు ఉన్నాయి.

తెలుగులో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లు తక్కువ సంఖ్యలో ఉండటం, స్టార్ హీరోల సినిమాలకు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే సూట్ అయ్యే అవకాశం ఉండటంతో థమన్ కు లెక్కకు మించి ఆఫర్లు వస్తున్నాయి.

అయితే థమన్ మ్యూజిక్ అందించిన గాడ్ ఫాదర్ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ విడుదలైంది.తక్కర్ మార్ అంటూ తాజాగా గాడ్ ఫాదర్ సినిమా నుంచి ప్రోమో విడుదల కాగా ఆ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఈ పాట కాపీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.క్రాక్ సినిమాలోని ఒక సాంగ్ ఎలా ఉందో ఈ సాంగ్ కూడా అలాగే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా సాంగ్స్ విషయంలో ఎన్నో అంచనాలు పెట్టుకున్నామని కానీ థమన్ మరోసారి నిరాశపరిచారని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ఫుల్ సాంగ్ విడుదలైన తర్వాత థమన్ పై విమర్శలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

Advertisement

చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఒకే సాంగ్ లో కనిపిస్తున్నారంటే ఆ సాంగ్ ఊహించని రేంజ్ లో ఉంటుందని అనుకున్నామని కానీ ఈ సాంగ్ మాత్రం ఆ అంచనాలలో పదో శాతం కూడా అందుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.గాడ్ ఫాదర్ మూవీ విషయంలో థమన్ మార్క్ మిస్సైందని నెటిజన్లు భావిస్తున్నారు.

క్రాక్ సినిమాకు ఇచ్చిన ట్యూన్ ను థమన్ మళ్లీ రిపీట్ చేయడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.థమన్ బాలయ్య, మహేష్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలకు వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది.మిగతా సినిమాల విషయంలో థమన్ ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో థమన్ కు ఆఫర్లు తగ్గే ఛాన్స్ అయితే ఉంది.

Advertisement

తాజా వార్తలు