రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేశాడా.. మూడేళ్లకో సినిమా తీయడానికి కారణం ఆయనేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కలు ఈ మధ్య కాలంలో పూర్తిగా మారిపోయాయి.స్టార్ హీరో సినిమా అంటే కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సాధారణం అయిపోయింది.

గతంతో పోల్చి చూస్తే సినిమాల బడ్జెట్లు ఏ స్థాయిలో పెరిగాయో అదే విధంగా వర్కింగ్ డేస్ కూడా అంతకు మించి పెరగడం హాట్ టాపిక్ అవుతోంది.అయితే కొంతమంది మాత్రం రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

ప్రతి డైరెక్టర్ రాజమౌళి( Rajamouli )ని ఫాలో అవుతూ రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమాను తీస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఎవరి శైలి, ఎవరి లెక్కలు వారికి ఉంటాయి.రాజమౌళి తక్కువ సమయంలోనే షూటింగ్ ను పూర్తి చేసి సినిమాలను విడుదల విడుదల చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి.

రాజమౌళి సినిమాకు అవసరమైతే మాత్రమే వర్కింగ్ డేస్ ను పెంచుతారు.

Advertisement

రాజమౌళి తన సక్సెస్ సీక్రెట్ ఎక్కువ రోజుల పాటు షూట్ చేయడం అని ఎక్కడా చెప్పలేదు.మూడేళ్ల పాటు తీసిన సినిమాలన్నీ బాహుబలి, బాహుబలి2( Baahubali 2 ) సినిమాలలా బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కాలేదు.అయినప్పటికీ రాజమౌళిని నిందిస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదని చెప్పవచ్చు.

రాజమౌళిని నిందించే వాళ్లు రాజమౌళి స్థాయి విజయాలు ఇతర దర్శకులకు ఎందుకు సాధ్యం కాలేదనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేరు.ఇతర ఇండస్ట్రీలలో కూడా చాలామంది దర్శకులు ప్రస్తుతం రెండు నుంచి మూడేళ్లు సినిమాలు తీస్తున్నారు.

విజువల్ వండర్స్ కోసం మూడేళ్ల సమయం తీసుకుంటే తప్పులేదు కానీ సాధారణ మాస్ మసాలా సినిమాల కోసం కూడా మూడేళ్ల సమయం తీసుకుంటే తప్పవుతుంది.రాజమౌళి రేంజ్ సైతం అంతకంతకూ పెరుగుతుండగా కెరీర్ ను జక్కన్న జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు