మీ ముక్కు పై కళ్ళజోడు మచ్చలు ఉన్నాయా..అయితే ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించండి..!

ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ కళ్ల అద్దాలను( Spectacles ) ఉపయోగిస్తూ ఉన్నారు.

వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముక్కు మీద కళ్లద్దాల మచ్చలు( Specs Marks on Nose ) కనిపిస్తూ ఉన్నాయి.

ఈ మచ్చలను తొలగించడానికి ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పని చేస్తాయి.

అంతే కాకుండా దోసకాయ ముక్కలు( Cucumber ) పిగ్మెంటేషన్ ద్వారా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.నల్లటి మచ్చ ఉన్న ముక్కు పై దోసకాయ ముక్కలు పెట్టడం వల్ల ఈ మచ్చలు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.సహజంగానే నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల నిమ్మరసం కళ్ళజోడు మచ్చలను తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే నిమ్మరసం, నీరు లేదా తేనె( Lemon Water ) మిశ్రమాన్ని నల్లటి మచ్చల పై పూయడం వల్ల ఈ మచ్చలను దూరం చేసుకోవచ్చు.ఈ సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించడంలో తేనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే నల్లని మచ్చల పై తేనెను అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్రతి రోజు చేసుకోవడం వల్ల క్రమంగా అవి తగ్గిపోతాయి.అలాగే బంగాళాదుంపలలో కూడా బ్లీచింగ్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి.

అందువల్ల కళ్ళజోడు ఉన్న ఏర్పడిన నల్లని మచ్చలను తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే నారింజ తొక్కల పొడి( Orange Peel Powder ) కళ్ళ జోడు మచ్చలను సమర్ధవంతంగా దూరం చేస్తుంది.నారింజ తొక్కల పొడిలో కొంచెం పాలను పోసి పేస్టులా తయారు చేసుకోవాలి.ఈ పేస్టును మచ్చలు ఉండే ప్రాంతంలో అప్లై చేసి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గిపోతాయి.

Advertisement

తాజా వార్తలు