త్వరలో భారతీయ వ్యోమగాములకు నాసాతో శిక్షణ : భారత్‌లో అమెరికా రాయబారి గార్సెట్టి

అంతరిక్ష యానంలో భారత సంతతి శాస్త్రవేత్తలు, వ్యోమగాములు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)తో పాటు స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్, వర్జిన్ గెలాక్టిక్ వంటి అనేక స్పేస్ ఏజెన్సీల్లో భారతీయులు కీలక హోదాల్లో వున్నారు.

అంతరిక్ష రంగంలో ఘన విజయాల కారణంగా ఇస్రోతో కలిసి పనిచేసేందుకు అనేక దేశాల స్పేస్ ఏజెన్సీలు క్యూకడుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి( Eric Garcetti )కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జాయింట్ మిషన్‌ను పంపడానికి అమెరికా, నాసాలు త్వరలో భారతీయ వ్యోమగాములకు అధునాతన శిక్షణను అందిస్తాయన్నారు.

శుక్రవారం బెంగళూరు( Bengaluru )లోని యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్ , యూఎస్ కమర్షియల్ సర్వీస్ నిర్వహించిన "US-India Commercial Space Conference: Unlocking Opportunities for US &a Indian Space Startups," ఈవెంట్‌లో గార్సెట్టి వ్యాఖ్యలు చేశారు.భారతీయ వ్యోమగాములకు శిక్షణ అనేది ఈ ఏడాది జరగొచ్చు లేదా భవిష్యత్తులోనైనా జరగొచ్చని ఆయన పేర్కొన్నారు.

Advertisement

పర్యావరణ వ్యవస్థలు, భూ ఉపరితలం, సహజ ప్రమాదాలు , సముద్ర మట్టం పెరుగుదల , క్రియోస్పియర్‌ సహా అన్ని వనరులను పర్యవేక్షించడానికి త్వరలో ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ( Satish Dhawan Space Centre )నుంచి "NISAR’’ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని ఎరిక్ గార్సెట్టి పేర్కొన్నారు.NISAR అంటే నాసా, ఇస్రోల ఉమ్మడి భూ పరిశీలన మిషన్.ఈ రంగంలో స్టార్టప్‌లు .భారతీయులు, అమెరికన్లకు మంచి వేతనం, హైటెక్ ఉద్యోగాలు వస్తాయని ఆయన ఆకాంక్షించారు.బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎరిక్ గార్సెట్టితో పాటు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధులు, భారత్-అమెరికాలకు చెందిన ప్రభుత్వాధికారులు, కమర్షియల్ స్పేస్ ఇండస్ట్రీకి చెందిన వాటాదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు, మార్కెట్ విశ్లేషకులు పాల్గొన్నారు.

2025 సంక్రాంతిని టార్గెట్ చేసిన హీరోలు వీళ్లే.. ఈ హీరోలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?
Advertisement

తాజా వార్తలు