నరుడా డొనరుడా రివ్యూ

చిత్రం : నరుడా డొనరుడా బ్యానర్ : ఎస్.ఎస్.

క్రియేషన్స్, రమా రీల్స్, దర్శకత్వం : మల్లిక్ రామ్ నిర్మాత : వై.

సుప్రియ, జాన్ సుధీర్ సంగీతం : శ్రీచరణ్ పకాల విడుదల తేది : నవంబర్ 4, 2016 నటీనటులు : సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ళ భరణి తదితరులు నటుడు సుమంత్ చాలాకాలం తరువాత నరుడా డోనరుడా అనే సినిమాతో మన ముందుకి వస్తున్నాడు.కొన్ని అపజయాల తరువాత ఆచీతూచీ వ్యవహరించి సేఫ్ గా ఓ రిమేక్ ని ఎంచుకున్నాడు సుమంత్.

మరి సుమంత్ ప్రయత్నం ఫలించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథలోకి వెళ్తే .డాక్టర్ ఆంజనేయులు (తనికెళ్ళ భరణి) ఒక ఇంఫెర్టిలిటి స్పెషలిస్టు.కాని సరైన వీర్యదాత దొరక్క తన హాస్పిటల్ కి వచ్చే రెస్పాన్స్ తగ్గిపోతూ ఉంటుంది.

మరోవైపు, అందంగా అరోగ్యంగా ఉండి అల్లరచిల్లరగా తిరిగే సగటు హైదరాబాద్ కుర్రాడు విక్కి (సుమంత్).ఇతడికి ఓ బెంగాళి అమ్మాయి ఆషిమా రాయ్ (పల్లవి సుభాష్) ఓ లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది.

Advertisement

ఇక మంచి డోనర్ కోసం వెతుకుతున్న డాక్టర్ కి విక్కి గురించి తెలుస్తుంది.ఎన్నో ప్రయత్నాల తరువాత విక్కిని వీర్యదానం కోసం ఒప్పిస్తాడు డాక్టర్.కాని విక్కి చేస్తున్న స్పెర్మ్ డొనేషన్ తన వివాహజీవితంలో చిచ్చు పెడుతుంది.

అప్పుడే విక్కి ఏం చేసాడు.ఇంతకి వీర్యాన్ని దానం చేయడం మంచా చెడా ? ఇదంతా తెర మీద చూడాల్సిందే.నటీనటుల నటన గురించి చాలాకాలం తరువాత సుమంత్ నటన రిలీఫ్ గా అనిపిస్తుంది.

సినిమా మొదలపెట్టకముందే పాత్ర కోసం కసరత్తులు మొదలుపెట్టినట్లున్నాడు సుమంత్.అయితే ప్రతీసారి కామెడీ టైమింగ్ కుదరదు.

మొత్తం మీద చెప్పాలంటే సుమంత్ మెప్పించాడు.తనికెళ్ళ భరణి మరో విలక్షణమైన పాత్రను పోషించారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
శ్రీవారి సన్నిధిలో మరో విషాదం.. లడ్డూ కౌంటర్లో అగ్నిప్రమాదం

ఆయన టైమింగే ఈ సినిమా బలం.పల్లవి సుభాష్ కి మేకప్ ఎక్కువైంది.హావాభావాలు బాగున్నా, ఆ లిప్ మూమెంటే ట్రాక్ తప్పుతూ ఉంటుంది.

Advertisement

పెద్దగా మార్క్ వేయని డెబ్యూ అనుకోండి.నాగార్జున అతిథి పాత్ర, నాగచైతన్య అతిథి పాత్ర రెండూ బాగున్నాయి.

హీరో తల్లితో చెప్పించిన సంభాషణలు నవ్వుతెప్పిస్తాయి.సాంకేతికవర్గం పనితీరు కెమెరా వర్క్ బాగుంది.

ముఖ్యంగా ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలను అందంగా చూపించారు.సంగీతం అస్సెట్.

ఆడియో పెద్ద హిట్టేమి కాదు, నేపథ్య సంగీతం బాగుంది.ఎడిటింగ్ లో ఒరిజినల్ సినిమాకి దీనికి చిన్ని చిన్ని మార్పులు చేశారు.

అయితే ఎడిటింగ్ మీద ఇంకాస్త వర్క్ చేయాల్సింది.నిర్మాణ విలువలు బాగున్నాయి.

సంభాషణలు కొన్ని డబుల్ మీనింగ్ తో ఉండి యువతను ఆకట్టుకుంటాయి.విశ్లేషణ : వీర్యదానం అనే టాపిక్ గురుంచి నలుగురితో మాట్లాడానికి కూడా ఇబ్బందిపడతాం.అలాంటిది ఏకంగా సినిమా తీసేసింది బాలివుడ్.

అదే విక్కి డొనార్.అప్పట్లో ఆ సినిమా బాక్సాఫీస్ తో పాటు విమర్శకులను గెలిచి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

దీన్ని తెలుగులో రిమేక్ చేయాలని కొంతమంది హీరోలు ఆలోచించి మళ్ళీ వెనక్కితగ్గారు.అలాంటి సమయంలో సుమంత్ గట్టి నిర్ణయమే తీసుకున్నాడు.

కాని సినిమాలో ఒరిజినల్ లో ఉన్నంత ఫ్లో లేదు.సింపుల్ గా ఉంచకుండా ఎక్కువగా ప్రయత్నించడం వలన కావచ్చు, లేదా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి కావచ్చు, వినోదం పాళ్ళు బాగానే జోడించారు.

కాని ఒక్కసారిగా కథ సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోయాక కించెం తేలిపోతూ ఉంటుంది.క్లయిమాక్స్, నాగచైతన్య కామియోలు పోయిన ఊపుని మళ్ళీ తీసుకొస్తాయి.

ఫ్రెష్ సబ్జెక్ట్ కి కూడా మనకు అలవాటైన కాస్టింగ్ నే తీసుకోవడం వలన ఆ ఫ్రెష్ నెస్ కూడా దెబ్బతింది.ఎవరిని నిందించాలి అంటే దర్శకుడినే.

చేతిలో అల్రెడి ఉన్న కథని సరిగా హ్యాండిల్ చేయకపోవడం దర్శకుడి తప్పే.మరో ప్రధాన సమస్య, మన తెలుగు మార్కేట్ సింగల్ స్క్రీన్ మార్కేట్.

సెకండాఫ్ లో ఉన్న ఎమోషన్స్ కి మన సింగల్ స్క్రీన్ ఆడియెన్స్ ఎంతలా కనెక్ట్ అవుతారు అనే దాని మీదే ఈ సినిమా భవితవ్యం ఆధారిపడి ఉంటుంది.మొత్తం మీద, కాస్త నవ్వుకోవడానికి ఓసారి చూడవచ్చు.హైలైట్స్ : * తనికెళ్ళ భరణి * డైలాగ్స్ * సంగీతం * క్లయిమాక్స్ డ్రాబ్యాక్స్ : * కాస్టింగ్ * కాస్త నెమ్మదించిన సెకండాఫ్ * ఎడిటింగ్ చివరగా : 60%-70% strike rate

తెలుగుస్టాప్ రేటింగ్ : 2.75/5

.

తాజా వార్తలు