దక్షిణాది రాష్ట్రాలే టార్గెట్ గా జాతీయ నాయకులు.. కారణం..?

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.త్వరలోనే లోక్ సభ ఎన్నికలు (Lokh Sabha Elections) రాబోతున్నాయి.

ఇక లోక్ సభ ఎన్నికలకు జాతీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి.దేశంలో ప్రధానంగా ఉన్న కాంగ్రెస్, బిజెపి మధ్యే గట్టి పోటీ ఉంటుంది.

అయితే ఈసారి బిజెపిని ఎలాగైనా ఓడించి కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ (Congress) సర్వశక్తులా ప్రయత్నాలు చేస్తుంది.అయితే లోక్ సభ ఎన్నికల్లో ఈసారి జాతీయ నాయకులందరూ దక్షిణాది వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే జాతీయ పార్టీలుగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ బిజెపికి( BJP ) ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది.ఇక ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలని చెప్పుకోవచ్చు.

Advertisement
Narendra Modi Sonia Gandhi Likely To Contest From Southern States In Loksabha El

ఇక దక్షిణాదిలో ఎక్కువగా జాతీయ పార్టీల హవా ఉండదు.దక్షిణాదిలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హవానే ఉంటుంది.

అయితే ఈసారి జాతీయ నాయకులందరూ దక్షిణాది రాష్ట్రాలపై కన్నేశారు.ఈ లోక్ సభ ఎన్నికల్లో చాలామంది జాతీయ నాయకులు దక్షిణాది రాష్ట్రాల నుండి పోటీ చేయాలని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈసారి తెలంగాణ నుండి సోనియమ్మ( Sonia Gandhi ) అలాగే నరేంద్ర మోడీ (Narendra Modi) కూడా తమిళనాడులోని రామేశ్వరం( Rameshwaram ) నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.అయితే జాతీయ నాయకులందరూ దక్షిణాదిపై ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం ఉత్తరాదిలో తమ పార్టీలకు ఉన్నంత హవా దక్షిణాదిలో లేదు.

Narendra Modi Sonia Gandhi Likely To Contest From Southern States In Loksabha El

అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో( South States ) కూడా తమ పార్టీని విస్తరించుకోవడం కోసం ఇలా చేస్తున్నారు.అలాగే ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో మోడీపై చాలా వ్యతిరేకత ఉంది.అయితే ఎంతో కొంత మోడీ మీద ప్రేమతో, అలాగే బిజెపి ఫాలో అయ్యే హిందుత్వం పేరుతో ఓట్లు వేసినప్పటికీ చాలావరకు వ్యతిరేకత అయితే ఉంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

అయితే బిజెపి (BJP) పార్టీ కేంద్రంలో ఫామ్ కావడం కోసం ఉత్తరాదిలో సీట్లు తగ్గితే కచ్చితంగా దక్షిణాదిలో పెరగాలి.

Advertisement

ఇక ఈ ఉద్దేశంతోనే మోడీ దక్షిణాదిలో కూడా తన పార్టీని విస్తరించడం కోసం దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు( Tamil Nadu ) నుండి పోటీ చేయాలని చూస్తున్నారట.ఇక గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) యూపీలో పోటీ చేసి ఓడిపోయారు.కానీ కేరళ( Kerala ) నుండి పోటీ చేసి గెలిచారు.

ఇక ఈసారి ప్రధాన పార్టీలుగా ఉన్న రెండు జాతీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలపైనే కన్నేసాయి.అయితే ఉత్తరాదిలో బిజెపి పార్టీ హవా నడిస్తే ఈ మధ్యకాలంలో దక్షిణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది.

అందుకే దక్షిణ రాష్ట్రాలపై మరింత ఫోకస్ పెంచారు రాహుల్ గాంధీ.ఇక బిజెపి పార్టీ కూడా దక్షిణాది రాష్ట్రాల పైన కన్నేసి నరేంద్ర మోడీ ఈసారి తమిళనాడులోని రామేశ్వరం నుండి అలాగే వారణాసిలో కూడా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక సోనియా గాంధీ కూడా రాయ్ బరేలీ తో పాటు తెలంగాణ నుండి లోక్ సభ ఎన్నికలకు పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు