ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన - నారాయణ, శ్రీ చైతన్య పాఠశాలలు సీజ్

సిరిసిల్ల పట్టణం లో ఏలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న నారాయణ, శ్రీ చైతన్య పాఠశాలలను సీజ్ చేశారు.

ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు మాట్లాడుతూ ఎలాంటి అనుమతి లేకుండా అడ్మిషన్స్ తీసుకొని విద్యార్థుల నుండి విచ్చలవిడిగా ఫీజుల వసూలు చేస్తూ అదే విదంగా పుస్తకాలు మూడింతలా రేటుకు అమ్ముతూ వారి వద్దనే కొనాలని విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్న యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

అదే విదంగా స్థానికంగా ఉన్న విద్య అధికారులు, జిల్లా విద్యాధికారులు కాసుల కక్రుత్తి పడుతూ పాఠశాల యాజమాన్యం నుండి డబ్బులు తీసుకొని కొమ్ము కాస్తున్నారన్నారు.ఇష్ట రాజ్యం గా అనుమతులు, ఎలాంటి భద్రత నియమాలు పాటించకున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి పాఠశాలలు ఇంకా ఉన్నాయని వాటి పైన కూడా చర్యలు తీసుకోవాలి అని లేని పక్షం లో రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో రాష్ట్ర హాస్టల్స్ కన్వినర్ రంజిత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రకాష్, రాజు, కార్తీక్, పవన్, శివ సందీప్, బాలు తదితరులు పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News