నాని, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ 'అంటే.. సుందరానికీ' సెకండ్ సింగిల్ 'ఎంత చిత్రం' మే 9న విడుదల

నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికీ ఫస్ట్ సింగిల్ పంచెకట్టు పాటకు అన్ని వర్గాలా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండవ సింగిల్ ఎంత చిత్రం పాటని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

మే 9న విడుదలయ్యే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని సర్ ప్రైజ్ చేయబోతుంది.ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్‌లో నాని, నజ్రియా నజీమ్‌లా కెమిస్ట్రీ లవ్లీగా వుంది.

నాని నిద్రపోతున్నట్లు నటిస్తూ నజ్రియాపై తల ఉంచడానికి ప్రయత్నిస్తుండగా.నజ్రియా ప్రేమగా నానిని చెంపపై చేయివేసి ఆపడం బ్యూటీఫుల్ గా వుంది.

సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ ప్లజంట్ గా వుంది.ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది.సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని.

ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు.

ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి అడాడే సుందరా అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ఆహా సుందరా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం

: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ వై , బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ , సిఈవో: చెర్రీ సంగీతం: వివేక్ సాగర్, సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి, ఎడిటర్: రవితేజ గిరిజాల, ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు,పబ్లిసిటీ డిజైన్: అనిల్, భాను పీఆర్వో: వంశీ, శేఖర్.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు