జెంటిల్ మెన్ రివ్యూ

చిత్రం : జెంటిల్ మెన్ బ్యానర్ : శ్రీదేవి మూవీస్ దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత : శివలంక కృష్ణప్రసాద్ సంగీతం : మణిశర్మ విడుదల తేది : జూన్ 17, 2016 నటీనటులు : నాని, సురభి, నివేదితా థామస్, అవసరాల శ్రీనివాస్ తదితరులు నాని లాంటి ప్రతిభావంతుడిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసారు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అష్టాచెమ్మా మంచి సక్సెస్ ని సాధించింది.

రెండొవసారి జెంటిల్ మెన్ కొసం ఈ ఇద్దరు కలిసి పనిచేయడం, నాని ప్రస్తుత ఫామ్ ని దృష్టిలో పెట్టుకోని నాని కెరీర్లో హయ్యెస్ట్ రేట్లు పెట్టి కొన్నారు పంపిణీదారులు.మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళ్తే .కాథెరీన్ (నివేదితా థామస్), ఐశ్వర్య (సురభి), ఇద్దరు ఒక ఫ్లయిట్ లో కలుకుంటారు.మంచి స్నేహం ఏర్పడటంతో ఇద్దరు తమ ప్రేమకథల్ని షేర్ చేసుకుంటారు.

కాథెరిన్ తన ప్రేమికుడు గౌతమ్ (నాని) గురించి చెబితే, ఐశ్వర్య , తాను పెళ్లి చేసుకోబోయే జైరామ్ (నాని) గురించి చెబుతుంది.ఇద్దరు ఫ్లయిట్ దిగే సమయంలో ఎవరు ఊహించని మలుపు తీసుకుంటుంది కథ.గౌతమ్, జైరామ్ లో చనిపోయింది ఎవరు? ఎలా చనిపోయాడు ? ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరకాలంటే సినిమా చూడాల్సిందే.నటీనటుల నటన గురించి : నానిలో ఇంతవరకు మనం చూడని కోణం ఇందులో కనబడుతుంది.రెండు భిన్నమైన నటనారీతులను ఒకే నటుడిలో, ఒకే సినిమాలో చూసే అవకాశం చాలా అరుదుగా దక్కుతుంది.

Advertisement

నటుడిగా నాని స్థానాన్ని ఎన్నో మెట్లు పైకి ఎక్కించిన సినిమాగా జెంటిల్మెన్ మిగిలిపోతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇద్దరు కథానాయికలు తెరమీద అందంగా కనిపించారు.తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.

ఇక అవసరాల శ్రీనివాస్ పాత్ర ప్రేక్షకుడు ఊహించని విధంగా సాగుతుంది.తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు శ్రీనివాస్.

వెన్నెల కిషోర్ కామెడి కాసేపు నవ్విస్తుంది.సాంకేతికవర్గం పనితీరు: మెలోడిబ్రహ్మ మణిశర్మకు ఇది కమ్ బ్యాక్ మూవీ అయ్యే అవకశాలు చాలా కనిపిస్తున్నాయి.టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు ఆయనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయన మాత్రమే చేయగలిగే రేంజ్ లో ఉంది.

అద్యంతం ఎక్కడా పట్టు సడలించకుండా, ఒక ఫ్లోలో వెళ్ళింది నేపథ్య సంగీతం.ఇక క్లయిమాక్స్ లో ఆయన రీరికార్డింగ్ సినిమాకి ఆయువుపట్టు.కాని పాటలు మాత్రం ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా లేవు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
శ్రీవారి సన్నిధిలో మరో విషాదం.. లడ్డూ కౌంటర్లో అగ్నిప్రమాదం

పి.జి.విందా కెమెరా పనితనం బాగుంది.మార్తండ్.

Advertisement

కే.వెంకటేష్ ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది.సంభాషణలు ఇంద్రగంటి సినిమాల్లో ఎప్పుడు ఉండేలా, బాగున్నాయి.

దర్శకుడిగా మొహన్ కృష్ణ తనపని తాను బాగా చేసారు.స్క్రీన్ ప్లేలో ఒకేరకమైన ఫ్లో లేకపోవడం ఒక్కటే మైనస్ పాయింట్.

విశ్లేషణ : ఇతర కుర్రహీరోలు ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక తంటాలు పడుతోంటే, నాని మాత్రం తన జడ్జిమెంటు కెపాసిటితో మంచి కథలను ఎంచుకుంటున్నాడు.నాని కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాగా జంటిల్మెన్ నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఫస్టాఫ్ లో రెండు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు నడుస్తాయి.ఈ రెండు కూడా మొహన్ కృష్ణ శైలిలోనే ఉండటంతో, మాస్ ప్రేక్షకుల ఓపికకు కొద్దిగా పరీక్ష తప్పదు.

ఆసక్తిగా వెళుతున్న కథకి పాటలు స్పీడ్ బ్రేకర్లలాగా అనిపిస్తుంటాయి.అయితే క్లాస్ ప్రేక్షకులకు నచ్చేస్తుంది ఫస్టాఫ్.

మంచి ట్విస్ట్‌ తో మొదటిభాగాన్ని ముగించడంలో సఫలమయ్యాడు దర్శకుడు.సెకండాఫ్ స్లోగా మొదలై, కాస్త పట్టు తప్పింది.

థ్రిల్లర్ సినిమాలు పట్టాలు తప్పేది ఇక్కడే.కాని తరుచుగా వస్తూ ఉండే ట్విస్టులతో పెద్దగా డిజపాయింట్ అవడు ప్రేక్షకుడు.

క్లయిమాక్స్ మీద ఎక్కువ ఊహలు పెంచుసుకుంటారు కాబట్టి, అక్కడ కొద్దిగా నిరాశపడొచ్చు.మొత్తం మీద సినిమా నచ్చుతుంది.

అయితే ఈ జానర్ సినిమాలకు బాక్సాఫీసు పుల్ ఎక్కువగా ఉండదు.సినిమాలో ట్విస్ట్‌ ఒకసారి తెలిసిపోయాక మళ్ళీ చూడటం కష్టమే కదా.మరీ ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఎగబడి చూసే సినిమా మాత్రం కాదు.హైలైట్స్ : * నాని * ప్రేమకథలు * కథలో మలుపులు * బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ * మిగితా నటీనటుల నటన, కాస్టింగ్ డ్రాబ్యాక్స్ : * పాటల సందర్భాలు * సినిమాటిక్ గా అనిపించే కొన్ని సన్నివేశాలు * స్లోగా అనిపించే సెకండాఫ్ నరేషన్ చివరగా : జెంటిల్మెన్ డిజాపాయింట్ చేయడు.చూడదగిన సినిమా.

తెలుగుస్టాప్ రేటింగ్ : 3/5.

తాజా వార్తలు