వయసు పెరుగుతుంటే చిన్న పిల్లగా మారిపోతున్న నమ్రత?

ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

వ్యక్తిగత విషయాలకు వస్తే ఈయన బాలీవుడ్ నటి నమ్రత( Namrata )ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నమ్రత తెలుగింటి కోడలుగా అడుగుపెట్టి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు అలవాటు పడి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

ఇండస్ట్రీ( Tollywood )లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందినటువంటి ఈమె మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి నమ్రత కేవలం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఒక సాధారణ గృహిణి లా జీవితం గడిపారు.అయితే ప్రస్తుతం పిల్లలు పెద్ద అవడంతో ఈమె మహేష్ బాబుకు మేనేజర్ గా వ్యవహరిస్తూ ఆయన సినిమా వ్యవహారాలను తన డేట్స్ అన్నింటిని కూడా చూసుకుంటున్నారు.

అలాగే వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు.

Advertisement

ఇకపోతే నమ్రత మహేష్ బాబు కన్నా వయసులో పెద్దది అనే విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం ఐదు పదుల వయసులోకి అడుగు పెట్టినటువంటి నమ్రత ఇప్పటికి చాలా అందంగా ఉంటారు.ఈమెకు వయసు పెరిగే కొద్దీ మరింత చిన్నపిల్లగా మారుతూ ఎంతో ఫిట్ గా ఉండటమే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేసుకుంటున్నారు.

ఇలా వయసు పెరిగిన నమ్రత ఇంత అందంగా ఉండడానికి కారణం లేకపోలేదు ఈమె ప్రతిరోజు తప్పనిసరిగా జిమ్ వెళ్లడమే కాకుండా ఆహార నియమాలను పాటిస్తూ తరచూ తన మనసుని వివిధ ఆలోచనలతో ఒత్తిడికి గురి చేయకుండా ఎంతో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారట.తన జీవన విధానాన్ని ఇదేవిధంగా అనుసరించడంతో నమ్రత వయసు పైబడిన ఇప్పటికీ యంగ్ గానే ఉంటూ ఎంతో ఆకట్టుకుంటున్నారని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు