నాగార్జున ఘోస్ట్ సినిమా ప్లాప్ అయితే పరిస్థితి ఏంటి?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీనియర్ హీరోలు, ఈ జనరేషన్ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి నుంచి విక్టరీ వెంకటేష్ వరకు ప్రతి ఒక సీనియర్ హీరో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఇకపోతే ఈ మధ్య కాలంలో హీరో విక్టరీ వెంకటేశ్ బ్యాక్ బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించిన విషయం తెలిసిందే.

కానీ టాలీవుడ్ మన్మధుడు హీరో నాగార్జున మాత్రం లాస్ట్ ప్లేస్ లో నిలవడం గమనార్హం.ఇకపోతే కెరీర్ ప్రారంభం నుంచి నాగార్జున ప్రయోగాలకే పెద్ద పీట వేస్తున్నారు.

ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ చేస్తూ తనదైన ప్రత్యేకతని చాటుకుంటున్నారు నాగార్జున.వైల్డ్ డాగ్, బంగార్రాజు లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రూపొందిన బంగార్రాజు సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద పరవాలేదు అని అనిపించింది.నాగార్జున ఆ సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నప్పటికీ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ ను సాధించలేకపోయింది.

Advertisement
Nagarjuna More Than Expectation On Ghost Movie, Tollywood, Nagarjuna, Ghost Movi

ఇది ఇలా ఉంటే ఈ ఏడాది మాత్రం నాగార్జున ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమాను ప్రేక్షకులకు అందించి సూపర్ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుని మళ్లీ బాస్ ఈస్ బ్యాక్ కావాలని భావిస్తున్నారు నాగార్జున.

Nagarjuna More Than Expectation On Ghost Movie, Tollywood, Nagarjuna, Ghost Movi

ఇకపోతే నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం ది ఘోస్ట్.ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన కీలక షెడ్యూల్ ని దుబాయ్ లో పూర్తి చేశారు.యాక్షన్ కాప్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీపైనే నాగార్జున భారీ ఆశలు పెట్టుకున్నారట.

ఎలాగైనా ఈ మూవీతో సక్సెస్ ని సొంతం చేసుకోవాలని మళ్లీ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నారట.మరి నాగార్జున ఈ సినిమాతో అయినా అనుకున్న విధంగా సక్సెస్ అవుతారో లేదో చూడాలి మరి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు