వియ్యంకులు కావాల్సిన నాగార్జున, బాలకృష్ణ.. కానీ మధ్యలో అలా జరగడంతో?

రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రిని ఏలుతున్న కుటుంబం అక్కినేని, నందమూరి.ఈ కుటుంబాల నుండి ఎందరో నటులు పరిచయమయ్యారు.

అంతేకాకుండా స్టార్ హోదాలను కూడా సంపాదించుకుంటున్నారు.ఇక ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సన్నిహితం కూడా ఉంది.

బయట సిని ఈవెంట్లలోనే కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ లలో కూడా ఒకరికొకరు పిలుచుకునేంత అభిమానం కూడా ఉంది.ఇదిలా ఉంటే ఈ కుటుంబాల నుండి ఇప్పటికి కూడా తమ వారసులకు పోటీగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నాగార్జున, బాలకృష్ణ లు గతంలో వియ్యంకులు కావాల్సి ఉండేనట.

అంతేకాకుండా ఒప్పందాలు కూడా చేసుకున్నారని తెలిసింది.గతంలో అక్కినేని నాగ చైతన్య కెరీర్ మొదట్లో మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో బాలయ్య.

Advertisement

వెంటనే నాగచైతన్యను తనకు అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడట.అయితే గతంలో ఈ విషయం బయటపడటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందట.

ఇక బాలయ్య తన రెండో కూతురిని నాగచైతన్యకు ఇచ్చి పెళ్లి జరిపించాలని అనుకున్నాడట.అంతే కాకుండా ఈ విషయాన్ని అక్కినేని నాగేశ్వర్ రావే బయట పెట్టినట్టు తెలిసింది.

ఇక ఈ విషయం గురించి నందమూరి కుటుంబం మొత్తం బాగా చర్చలు కూడా చేశారట.అలా బాలయ్య.

నాగార్జునతో మంచి దగ్గర సంబంధాన్ని కోరుకున్నాడని తెలిసింది.కానీ అంతలోనే ఏం మాయ చేసావే సినిమాలో నటించిన సమంతతో ప్రేమలో పడ్డాడట నాగ చైతన్య.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

కానీ ఈ విషయం అప్పట్లో ఎవరికి తెలియక పోగా లోలోపల ఏం జరిగిందో అని.అందుకే నాగ చైతన్య బాలయ్యకు అల్లుడు కాలేకపోయాడని కొందరు వాపోయారని తెలిసింది.అలా కొంతకాలం తర్వాత నాగ చైతన్య, సమంతల మధ్య ప్రేమ బయటపడటంతో గతంలో ఆ సంబంధం అందుకే ఆగిపోయిందని అనుకున్నారు.

Advertisement

ఇక నాగ చైతన్య, సమంత తమ ఇంట్లో తమ ప్రేమ గురించి చెప్పడంతో వారికి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.అలా సమంత కూడా నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకుంది.

కారణం తాను అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టినందుకు అనే చెప్పాలి.పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్యలు కలిసి సినిమాలలో, పలు ప్రకటనల్లో కూడా నటించారు.అలా తమ జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో ఒకేసారి వారి మధ్యలో విడాకుల సునామి ఎదురయ్యింది.

ఇటీవలే ఈ జంట తమ ఇష్టపూర్వకంగానే విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.ఇక వీరిద్దరు విడిపోయాక సమంతనే చాలా తప్పు పట్టారు.కానీ వీరిద్దరి విడిపోవడానికి అసలు నిజాలు మాత్రం బయటికి రాలేదు.ఒకరికొకరు దూరంగా ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

తమ తమ సినిమాలలో బిజీగా ఉన్నారు.ఇదంతా ఇలా ఉంటే నాగచైతన్య పెళ్లి గురించి మళ్లీ చర్చలు వస్తున్నాయి.

నాగచైతన్య జీవితంలో కూడా రెండో పెళ్లి ఉందని అభిమానులు అనుకుంటున్నారు.అంతలోనే గతంలో బాలయ్య తన కూతురికి నాగ చైతన్యను ఫిక్స్ చేయాలనుకున్నాడన్న వార్త బయటకి రావడంతో.

నాగచైతన్య అభిమానులంతా అప్పుడే బాలయ్య అల్లుడుగా ఉంటే ఇప్పటివరకు నాగచైతన్య తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండేవాడు అని కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు