ఆ పని చేస్తే శోభితకు అస్సలు నచ్చదు... భార్యపై కంప్లైంట్స్ చేసిన చైతూ!

సినీ నటుడు నాగచైతన్య( Nagachaitanya ) నటి శోభిత( Sobhita ) గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ గత ఏడాది డిసెంబర్ నెలలో ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ వివాహం తర్వాత నాగచైతన్య తన తండేల్( Thandel )  సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో కొత్తజంట పెద్దగా బయట కలిసి కనిపించలేదు.

కానీ ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో నాగచైతన్య కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చి శోభితతో కలిసి వెకేషన్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Nagachaitanya And Sobhita Tells Interesting Things About Each Others Details, Na

తాజాగా నాగచైతన్య శోభిత వోగ్ ఇండియా మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా వీరిద్దరూ వారి ప్రేమ పెళ్లి గురించి అలాగే ఇతర విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా నాగచైతన్య శోభిత గురించి మాట్లాడుతూ శోభిత ఫుడ్ తినేటప్పుడు చాలా ప్రశాంతంగా ఆ ఫుడ్ ఆస్వాదిస్తూ తినాలని భావిస్తుంది.

ఇలా ఫుడ్ తినేటప్పుడు ఎవరైనా మాటలు పెట్టుకుంటే తనకు అస్సలు నచ్చదు.తను కూడా భోజనం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడదని తెలిపారు.

Nagachaitanya And Sobhita Tells Interesting Things About Each Others Details, Na
Advertisement
Nagachaitanya And Sobhita Tells Interesting Things About Each Others Details, Na

ఇక చైతన్య మాటలకు వెంటనే శోభితో మాట్లాడుతూ ఒంటరిగా ఫుడ్డు తినడం అనేది కూడా ఒక కళ అని తెలిపారు.ముంబైలో నేను ఒంటరిగా నివసించేటప్పుడు అలాగే తినేదాన్ని.పెళ్లి అయ్యాక ఫ్యామిలీ అందరితో కలిసి తినడం ఒక మంచి అనుభూతి అని తెలిపింది.

ఇక శోభిత గురించి మాట్లాడుతూ నాగచైతన్య తన ఫేవరెట్ బైక్ క్లీనింగ్ కోసం రెండు గంటల సమయం కేటాయిస్తారని తెలిపారు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మొదటిసారి వీరి పరిచయం ఎక్కడ ఏర్పడింది.

వీరి ప్రేమ ఎలా మొదలైంది అనే విషయాలు గురించి కూడా తెలియజేశారు.

సందీప్ రెడ్డి వంగ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించనున్న అల్లు అర్జున్...
Advertisement

తాజా వార్తలు