Naga Shaurya Anusha Shetty : పెళ్లితో ఒక్కటైన యువ జంట.. నాగశౌర్య-అనూష వెడ్డింగ్ పిక్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.ప్రస్తుతం నాగ శౌర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు.లుక్ పరంగా కూడా నాగ సౌర్య అదుర్స్ అనిపిస్తున్నాడు.

ఇటీవలే నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇక కెరీర్ లో చాలా రోజుల తర్వాత హిట్ కొట్టి ఖుషీగా ఉన్న ఈయన ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో కూడా ఆనందంగా ఉన్నాడు.ఎందుకంటే ఈ రోజు నాగ శౌర్య పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు.

Advertisement

ఈయన పెళ్ళికి సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.నాగ శౌర్య పెళ్ళిలో చేసిన ఎంజాయ్ మెంట్ చూసి ఆయన ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేసేస్తున్నారు.

నాగ శౌర్య అందానికి, హైట్ కు ఏమాత్రం తీసిపోని విధంగా తన సతీమణి ఉంది.బంధు మిత్రుల మధ్య ఆనందంగా నాగ శౌర్య తన సతీమణి మెడలో తాళి కట్టి, తలంబ్రాలు పోసి ఆ ఘట్టాన్ని విజయ వంతంగా పూర్తి చేసాడు.

నాగ శౌర్య బెంగుళూరు కు చెందిన అనూష శెట్టి ని ఈ రోజు ఉదయం పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లితో ఒక్కటైనా ఈ జంట మధ్య జరిగిన అందమైన ఘట్టాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి.ఈయన పెద్దలు కుదిర్చిన అనూష అనే ఇంటీరియర్ డిజైనర్ ను పెళ్లి చేసుకున్నాడు.బెంగుళూరు లోని స్టార్ హోటల్ లో ఈ పెళ్లి బంధు మిత్రుల మధ్య కోలాహలంగా అల్లరి మధ్య జరిగింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

రెండు రోజుల నుండే వీరి వివాహ వేడుక ముందు జరిగే వేడుకల నుండి రకరకాల ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి.ఇక ఈ రోజు పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మాధ్యమాల్లో అలరిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు