22 ఏళ్ల క్రితం మంచుకొండలపైన మిస్సింగ్.. ఇప్పుడు అతడి లుక్కు చూస్తే..??

అమెరికాకు( America ) చెందిన విలియం స్టాంప్( William Stamp ) ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం.

అమెరికా వ్యాప్తంగా ఉన్న పర్వతాలను అన్నిటిని కూడా అతడు అధిరోహించిన పర్వతారోహకుడుగా ( Mountaineer ) పేరు సొంతం చేసుకున్నాడు.

అంతే కాకుండా మంచు, మట్టి, దట్టమైన అడవి అని తేడా లేకుండా అన్ని శిఖరాలను అధిరోహించి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.విలియం దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో( Peru ) ఉన్న హుస్కరన్ అనే మంచు పర్వతం ఎక్కాలని వెళ్ళాడు.

అయితే అలా వెళ్లిన అతడు కొద్ది రోజులకు అదృశ్యం అయ్యాడు.వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.

అయినా కానీ, అతడి జాడ కనిపించలేదు.దీనితో విలియం కుటుంబ సభ్యులు అతనిపై ఆశ వదిలేసుకొని జీవిస్తూ ఉన్నారు.

Mummified American Climber Found 22 Years Later In Peru As Glaciers Retreat Deta
Advertisement
Mummified American Climber Found 22 Years Later In Peru As Glaciers Retreat Deta

2002 లో హుస్కరన్ పర్వతాన్ని( Huascaran Mountain ) ఎక్కేందుకు వెళ్లిన విలియం ఎన్ని రోజులకు రాకపోవడంతో చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు.అయితే తాజాగా 22 సంవత్సరాలు గడిచిన అనంతరం విలియం ఆచూకీ లభ్యం అయింది.కాకపోతే విలియం మాత్రం చనిపోయి ఉన్నాడు.

అతని మృతదేహం మంచు పర్వతంలో దొరికింది.వాస్తవానికి అతని మృతదేహం పై మంచు దట్టంగా పేరుక పోవడంతో ఒంటిపై ఉన్న దుస్తులు, బూట్లు చివరికి పాస్ పోర్ట్ కూడా చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి.

ఇక ఈ విషయాన్ని అక్కడ పర్వతారోహకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.పోలీసులు మృతదేహం వద్దకు వచ్చి లభ్యమైన ఆధారాల ప్రకారం పోలీసులు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిపారు.

Mummified American Climber Found 22 Years Later In Peru As Glaciers Retreat Deta

ఇక విలియం మృతదేహాన్ని పోలీసులు కుటంబీకులను తీసుకొని వెళ్ళమని చెప్పారు.ఆ ప్రాంతంలో మంచు దట్టంగా కురవడం వల్లనే ఇన్ని రోజులైనా విలియం మృతదేహం కుళ్ళిపోలేదని అక్కడి పోలీస్ వారు తెలియజేస్తున్నారు.వాస్తవానికి పర్వతంపై ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలో ఉండడంతో బ్యాక్టీరియా, వైరస్ ఆ ప్రాంతంలో ఉండే అవకాశం లేదని అందువలనే విలియం మృతదేహం పాడవలేదని వారి అభిప్రాయం.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
న్యూస్ రౌండప్ టాప్ 20 

ఇక మరోవైపు విలియం కుటుంబ సభ్యులు “విలియం జ్ఞాపకాలలో ఇన్నాళ్లు బతికాం.అతడి జాడ కోసం చాలా ఏళ్లు వేచి చూసాము.అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

Advertisement

చివరికి అతడు మాకు ఒక జ్ఞాపకం లాగా మిగిలిపోయాడు.చివరికి ఇన్నాళ్లకు దేవుడు మా మొర ఆలకించినట్టు ఉన్నాడు.

అందుకే అతడి చివరి చూపును మాకు దక్కించాడని., విలియంను ఇక చూడలేం అనుకుంటున్న సమయంలో.

అతడి మృతదేహాన్ని మాకు అందేలా చేశాడని” కుటుంబ సభ్యులు వారి భావనను వ్యక్తం చేశారు.

తాజా వార్తలు