సీతారామం హీరోయిన్ కు ఈ కోరిక ఏంటో.. పెళ్లి కాకుండానే పిల్లలు కావాలట!

మృణాల్ ఠాకూర్.ఈ పేరు వినగానే గుర్తు పట్టకపోవచ్చు కానీ సీతారామం సినిమాలో హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపడతారు.

దుల్కర్ హీరోగా నటించిన సీతారామం సినిమా ఆగస్టు 5న విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా,అశ్వనీ దత్ నిర్మించారు.

అలాగే ఇందులో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ లు కూడా కీలక పాత్రల్లో నటించారు.ఈ సీతారామం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ మృణాల్.

అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో మృణాల్ కు బాగానే ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే ఈ భామకు జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్‌ గా నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం.

Advertisement
Sitaramam Movie Fame Mrunal Thakur Opens Up On Wanting A Baby, Being A Single Mo

అలాగే ఎన్టీఆర్ 30 సినిమాలో మృణాల్ ఠాకూర్‌ను దాదాపుగా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట ఆ చిత్ర యూనిట్.ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ప్రేమలో పడి పిల్లల్ని కనాలని ఉంది అని తెలిపింది.

నా మైండ్ లో ఏం రన్ అవుతుందో అర్థం చేసుకునేవాడు బాగా స్వామిగా రావాలి.

Sitaramam Movie Fame Mrunal Thakur Opens Up On Wanting A Baby, Being A Single Mo

అటువంటి వారు అంత ఈజీగా దొరకరు.కానీ నాకు పిల్లల్ని కనాలని ఉంది.ఆ విషయంలో మా అమ్మ నాకు ఎంతో సపోర్టివ్.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

పెళ్లి కాకుండానే అండాన్ని భద్రపరిచి పిల్లల్ని కనాలని కోరికగా ఉంది అని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.లేదా ఒంటరి తల్లిగా ఉంటాను అని చెబితే అమ్మ ఒకే చెప్పింది అని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.

Advertisement

తాజా వార్తలు