MP Komatireddy Venkatareddy : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

నేను ఎంపీ అయినా రాజకీయాలకు దూరంగానే ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

గురువారం ఉదయం కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో‌ పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనంతరం ఆలయ వెలుపల కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.

కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉందన్నారు.గత రెండున్నర సంవత్సరాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని కుదిపేసి, ప్రాణాలను బలిగొన్న రోగాలు రాకుండా ప్రజలను కాపాడాలని ప్రార్ధించినట్లు చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలియజేశారు.గుజరాత్ ఎన్నికల ఫలితాలు నేను చూడలేదని, దేవుని సన్నిధిలో రాజకీయాలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

Advertisement

కోవిడ్ కారణంగా ఆర్ధిక పరిస్ధితి చిన్నాభిన్నంమైందని, స్వామి వారి ఆశీస్సులతో ప్రజల కష్టాలు అన్ని తొలగి పోవాలని,ఏ పార్టి అధికారంలో ఉన్నా, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కష్టపడి ప్రజల కష్టాలను తొలగించాలని ఆయన కోరారు.షర్మిలాను త్రోయింగ్ చేసి తీసుకెళ్లడంను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.

మహిళా నాయకురాలైన షర్మిలాకు నచ్చజెప్పి తీసుకెళ్ళి ఉండాల్సిందన్నారు.రాజకీయంగా నేను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పినా ఆయన, ఎంపీ అయినా ప్రస్తుతం రాజకీయాలను నేను దూరంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

పార్లమెంట్లల్లో అందరి ఎంపీల కంటే ఎక్కువ నిధులు తెచ్చుకున్నది నేనేనని, ప్రస్తుతం నా నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టానని ఆయన తెలియజేశారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు