OTT Movies: ఓటీటీలలో రిలీజ్ కాని భారీ సినిమాలు ఇవే.. ఈ సినిమాలకు ఓటీటీ మోక్షం లేనట్టేనా?

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓటీటీ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదల అయ్యే సినిమాల కంటే ఓటీటీలో( OTT ) విడుదల అయ్యే సినిమాల సంఖ్యనే చాలా ఎక్కువగా ఉంది.

ఇక చాలామంది ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీకే పరిమితం అవుతుండడంతో పెద్ద పెద్ద దర్శకులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.చిన్న చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ సైతం నెల తర్వాతే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజై నెలల గడుస్తున్నా కొన్ని సినిమాలు ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు.

ఇంతకీ ఆ సినిమాలు ఏవి ఎందుకు విడుదల కావడం లేదు అన్న వివరాల్లోకి వెళితే.అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా( Agent Movie ) విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఓటీటీలో విడుదల కాలేదు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సోనీ లివ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.మరి ఈ మూవీ ఓటీటీ లో ఎందుకు విడుదల అవ్వడం లేదు అన్నది తెలియడం లేదు.

అలాగే లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం క‌నెక్ట్.( Connect ) థియేట‌ర్ల‌లో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు.అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో థ్రిల్ల‌ర్‌ మూవీగా తెరకెక్కించారు.

ఈ సినిమా గ‌తేడాది డిసెంబ‌ర్‌లో థియేట‌ర్లలో విడుద‌లైంది.న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ఈ మూవీని నిర్మించాడు.క‌నెక్ట్ ఓటీటీ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ద‌క్కించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

కానీ సినిమా మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీలో విడుదల కాలేదు.హీరోయిన్ ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ది కేరళ స్టోరీ.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

( The Kerala Story ) బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అయితే ఈ చిత్రం రిలీజ్ నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓటీటీకి రావడం లేదు.

Advertisement

ఇలా ఈ మూడు సినిమాలు విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఓటీటీ బాట పట్టడం లేదు.ఈ విషయం గురించి అనేది కథనాలు వినిపించినా కూడా మూడు మేకర్స్ వాటిపై స్పందించడం లేదు.

తాజా వార్తలు