ఖమ్మం జిల్లాలోని మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు.తాము కేసీఆర్ లా గాలి మాటలు చెప్పడం లేదన్నారు.
ఉచిత విద్యుత్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.ఇంటి అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందించడంతో పాటు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.సంపదను అందరికీ పంచుతామన్న భట్టి ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని వెల్లడించారు.